మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అరెస్టును నారా లోకేశ్ ఖండించారు రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు అత్యంత సౌమ్యుడైన వెంకటరావు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారం అండతో ఇంకెంత మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తావు జగన్?’ అని ట్వీట్ చేశారు
Read More »ఏకైక ఎమ్మెల్సీ వైసీపీ వశం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్.
ఏపీలో కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు యత్నించారు. TDP నేత దేవినేని ఉమ. కోవిడ్ నేపథ్యంలో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం ఆందోళన చేస్తున్న ఉమను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది. దీంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా సెలవులు ఉండవని పేర్కొంది. కరోనాతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనవరి 18 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతున్నాయి..
Read More »‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులను మేఘా ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ తో ప్రకాశం, కడప జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ఇక వెలిగొండ సొరంగ మార్గం కోసం ఎంఈఐఎల్ సంస్థ అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ను వినియోగించింది. కరోనా, ఇతర అవరోధాలను ఎదుర్కొని రికార్డు సమయంలో 3.6 కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేసింది. ఎంఈఐల్ సంస్థ రాత్రింబవళ్లు కష్టపడి 9.23 మీటర్లు తవ్వడం …
Read More »ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్
ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్రజలకు ప‌్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్రజల మనసులను దోచేసుకున్నారు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More »బాబు అన్నంత పని చేసేశాడు
కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన CM ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. రైతులకోసం తాను పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో MP కేశినేని నాని, దేవినేని ఉమ పాల్గొన్నారు
Read More »వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సునీత
ఏపీలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో శాసనమండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు వైకాపా తరఫున పోతుల సునీత పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. సోమవారం ఆమె మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలవనున్నారు. అనంతరం నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. 18న రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల …
Read More »మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ నిరాకరణ
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బెయిల్ నిరాకరించింది. సికింద్రాబాద్ కోర్టు. 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది అఖిలప్రియ. సీన్ రీ- కక్షతో పాటు, కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కోర్టు బెయిల్ …
Read More »మాజీ సీఎం చంద్రబాబుపై కేసు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తాం.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు.. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.. విద్వేష వ్యాఖ్యలు చేసిన అందరిపైనా కేసులు పెడతాం’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. తన …
Read More »