Home / ANDHRAPRADESH / మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ నిరాకరణ

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ నిరాకరణ

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బెయిల్ నిరాకరించింది.

సికింద్రాబాద్ కోర్టు. 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది అఖిలప్రియ. సీన్ రీ- కక్షతో పాటు, కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కోర్టు బెయిల్ నిరాకరించింది.

బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందంటున్నారు పోలీసులు.