విశాఖపట్టణం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్య నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. ఇదే ఘటనలో మాజీ ఎమ్మెల్యే శివేరి సోమని కూడా మావోయిస్టులు మట్టుబెట్టడంతో రెండు రాష్ట్రాల్లో పోలీసులు ఒక్కసారిగా అప్రమప్తమయ్యారు. ఆదివారం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన మైనింగ్ క్వారీ వద్దకు వెళుతుండగా డుంబ్రీగూడా మండలం లిప్పిట్టిపుట్ట వద్ద మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన …
Read More »అరకులో మావోయిస్టుల ఘాతుకం…..విశాఖ ఏజెన్సీలో హై అలర్ట్
అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఈ దాడిలో ఎమ్మెల్యే చాతిలో నుంచి బుల్లెట్టు దూసుకెళ్లడంతో ఘటనాస్థలిలోనే ఆయన కుప్పకూలారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది.సర్వేశ్వర రావుకు రక్షణగా ఇద్దరు …
Read More »మావోయిస్టుల కిరాతకం….ఎమ్మెల్యే కిడారి మృతి
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం నాడు మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోలు కాల్పులకు దిగారు. తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు.మాజీ ఎమ్మెల్యే శివేరి సోము కూడా చనిపోయారు. ఇటీవల కాలంలో ఏజెన్సీలో మావోలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో అవకాశం కోసం మావోయిస్టులు ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను టార్గెట్‌గా చేసుకుని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కిడారి సర్వేశ్వరరావుని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. కిడారి ఇటీవలే …
Read More »భర్తకు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం
ఏపీలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటి వల్ల హత్యలు…ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక పక్క పరువు హత్యలతో అలజడి రేగుతుంటే … మరో పక్క అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుతోంది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలతో హత్యలకు గురౌతున్నారు. భర్త కు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహారాష్ట్ర యువతి ఉదంతం …
Read More »పాపం అమ్మాయి..తన తండ్రి… ఎవరికి చెప్పుకోవాలో తెలియక
ఆడది కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు కామాంధులు. అత్యంత దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్నారు. ఎక్కడ చూసిన దుశ్చర్యలను మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా కామాంధుల లైంగిక వేధింపులను భరించలేని ఓ విద్యార్థిని తనువు చాలించింది. తన తండ్రి స్నేహితుడే వేధించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బలవన్మరణానికి పాల్పడిందిం. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే… అర్బన్ జిల్లాలోని కాశిబుగ్గ ఎస్‌ఆర్‌నగర్‌లో …
Read More »మంత్రి జగదీశ్ రెడ్డిపై హత్యకు కుట్ర?
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు దుండగులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సూర్యాపేట జిల్లాలోని తన స్వగ్రామమైన నాగారంకు మంత్రి తరచుగా వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు పెద్దగా సెక్యూరిటీని పట్టించుకోకుండా గ్రామస్తులతో కలిసిపోతారు. ఈ నేపథ్యంలో మంత్రి హత్యకు కొందరు దుండగులు స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపధ్యంలో నాగారంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తమకు సమాచారం …
Read More »కర్నూలు జిల్లా ప్యాపిలిలో జరిగిన ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రత్యేకహోదా కోసం మహేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న …
Read More »నా తండ్రిని ఉరి తీయండి…అమృత
ప్రేమించి పెళ్లాడిన తన భర్త ప్రణయ్ ఇక లేడనే విషయం తెలియగానే అతడి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రణయ్ పై దాడి జరగటానికి ముందు మా నాన్న ఫోన్ చేశాడని… నన్ను అబార్షన్ చేయించుకొమ్మని ఫోర్స్ చేశాడని… తాను ఒప్పుకోలేదని కన్నీరుమున్నీరైంది.ఆస్పత్రిలో ఉన్న అమృతను పరామర్శించేందుకు వచ్చినవారి ముందు విలపిస్తూ… నా కళ్ల ముందే ప్రణయ్‌ని హత్య చేశారంటూ విలపించింది అమృత. తన కళ్ల ఎదుటే ప్రణయ్‌ను …
Read More »మిర్యాలగూడలో పట్టపగలే దారుణ హత్య
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ హత్య జరిగింది. ప్రణయ్ అనే యువకుడిని పట్టపగలు నడి రోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో ప్రణయ్ మరణించాడు. 6 నెలల కిందే ప్రణయ్‌కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది. భార్య గర్భవతి కావటంతో హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తీ ప్రణయ్ పై కత్తితో దాడిచేసి హతమార్చాడు. దీంతో భార్య షాక్ కు గురైంది. అమృతని …
Read More »ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
నిరుద్యోగి ఆత్మహత్య…….విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన దుర్గారావు బీటెక్ చదువుకున్నాడు.ఉద్యోగ సాధన కోసం ఎక్కడికి వెళ్లిన పోటీ ఉండడం, ఎంత ప్రయత్నించిన ఉద్యోగం రాకపోవడంతో గత కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోతున్నాడు.తీవ్ర మనస్తాపనికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని స్తానికులు ఆస్పత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతిచెందాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడం, ప్రైవేట్ …
Read More »