తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పద్దెనిమిది సర్కారు దవాఖానాల్లో రోగుల వెంట వచ్చే సహాయకుల కోసం రూ.5కే రుచికరమైన ఇంటి భోజనం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్ సమక్షంలో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ,హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు …
Read More »GHMC లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మీర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫైంటెన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఎస్‌టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలాపత్తర్‌లో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పారిశుధ్య కార్మికులకు జీతాలను రూ.8వేల నుంచి రూ.17వేలకు …
Read More »జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాంప్ ఫార్మాలో కేటీఆర్ మొక్క నాటారు. అనంతరం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణలో రూ. 250 కోట్లతో జాంప్ ఫార్మాను నెలకొల్పడం సంతోషకరమన్నారు. 200 మందికి జాంప్ ఫార్మా ద్వారా ఉపాధి లభిస్తుందన్నారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమకు అహ్మదాబాద్ కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టం అంటున్నారని చెప్పారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా …
Read More »Drugs Case-వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. 6 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పబ్లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ప్యాకెట్లు కనిపించాయి. పోలీసులు దాడులతో యువతీ యువకులు పరుగులు తీశారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా అందులో మాజీ ఎంపీ, మాజీ డీజీపీ కూతుళ్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల …
Read More »Drugs Case-హేమ అగ్రహాం..ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డెకాయి ఆపరేషన్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనకు సంబంధం లేకపోయినా తన పేరుని పలు ఛానల్లో ప్రసారం చేస్తున్నారు.. తన పేరు బద్నాం చేస్తున్నారని నటి హేమ వాపోయారు. సదరు …
Read More »Drugs Case-రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ….
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ‘ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లా. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కానీ అడ్డంగా దొరికానని నాపై వార్తలు రాస్తున్నారు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. ఏ టెస్టుకైనా సిద్ధం. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. డ్రగ్స్ ఎలా ఉంటాయో …
Read More »Hyderabad Drugs Case-4గురు అరెస్టు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది..ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని పబ్ లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్ రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ముప్పల, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే …
Read More »హీరో మనోజ్ కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై నగర ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మంచు మనోజ్ అడ్డంగా దొరికిపోయారు. హీరో మనోజ్ నడుపుతున్న ఏపీ 39HY …
Read More »గ్రేటర్ ఆర్టీసీలో పెను మార్పులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగర పరిధిలోని గ్రేటర్ ఆర్టీసీలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించిన ఈడీతో పాటు ఇద్దరు ఆర్‌ఎంలు, 29 మంది డీఎంల బదిలీల నేపథ్యంలో గ్రేటర్‌లో బస్సుల ఆపరేషన్స్‌పై ప్రభావం పడకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ జోన్ నూతన ఈడీ ఈ.యాదగిరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో …
Read More »భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే Kp కు వినతి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ గ్రామంలోని లహరి గ్రీన్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యను పరిశీలించి, …
Read More »