తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగర పరిధిలోని గ్రేటర్ ఆర్టీసీలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించిన ఈడీతో పాటు ఇద్దరు ఆర్‌ఎంలు, 29 మంది డీఎంల బదిలీల నేపథ్యంలో గ్రేటర్‌లో బస్సుల ఆపరేషన్స్‌పై ప్రభావం పడకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
ఈక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ జోన్ నూతన ఈడీ ఈ.యాదగిరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు నగరం లో ప్రయాణికుల రద్దీ రూట్లపై దృష్టిసారించింది.
ఈ క్రమంలో ఆయా రూట్ల లో బస్సుల ట్రిప్పులు పెంచుతామన్నారు. డిపోల వారీగా నష్టాలు తగ్గిస్తూ రోజువారి ప్రయాణికుల సంఖ్య పెంచేదిశగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. శివారు ప్రాంతాలకు బస్సుల ట్రిప్పులు పెంచడంపై దృష్టిపెడుతామన్నారు.