తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… చందమామ బ్యూటీ…ఇటీవల పెళ్లైన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘రౌడీ బేబీ’ అనే సినిమాతో రిస్క్ చేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్ళి తర్వాత విభిన్న కథా చిత్రాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’, నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా, ‘ఇండియన్ 2’లతో పాటు తమిళంలో కొత్త ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లను కమిటవుతోంది. ఇందులో భాగంగానే …
Read More »ఓ వ్యక్తిని ప్రేమించాను-అనుపమ పరమేశ్వరన్
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎక్కువగా ప్రేమకథల్లోనే నటించారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ఆ నేపథ్యానికి చెందినవే! చాలాకాలంగా ఆమె ప్రేమలో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆమె అలాంటిది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఆమెకు ప్రేమ ఉండేదని, కొన్ని కారణాల వల్ల విఫలం అయిందని ఆమె తెలిపారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. తెలుగు పాటలు పాడి అలరించారు. ఆ …
Read More »‘నవరస’ తమిళ వెబ్ సిరీస్ టీజర్ విడుదల
‘నవరస’ తమిళ వెబ్ సిరీస్ టీజర్ రిలీజైంది. 9 మంది కథలతో నవరస పేరుతో మణిరత్నం ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఆ టీజర్ కోసం వాడిన టైటిల్ ట్రాక్ కూడా ట్రెండింగ్‌లో మారుమోగుతోంది. ఈ సిరీస్‌కు ఏఆర్ రెహ్వాన్ మ్యూజిక్ అందించారు. గౌతమ్‌మీనన్, బెజోయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజ్, కార్తిక్ నరేన్, కేవీ ఆనంద్, రతీంద్రన్‌ప్రసాద్, హరితాసాలిమ్, అరవిందస్వామి ఒక్కో భాగానికి దర్శకత్వ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. ఆగస్టు …
Read More »‘సర్కారు వారి పాట’ లో సముద్రఖని
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇందులో ‘క్రాక్’ మూవీ విలన్ సముద్రఖనిని తీసుకున్నట్టు తాజా సమాచారం. నిన్నా, మొన్నటి వరకు ‘సర్కారు వారి పాట’లో మహేష్‌ని ఢీకొట్టే విలన్ పాత్రకి సీనియర్ నటుడు అర్జున్‌ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్ని వట్టి పుకార్లేనని, ‘అలవైకుంఠపురములో’, ‘క్రాక్’ సినిమాలలో తన విలనిజంతో ఆకట్టుకున్న …
Read More »ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ను కలిసిన సోనూసూద్
ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ను కలిసిన సోనూసూద్..ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల …
Read More »ప్రభాస్ తో “చందమామ” కాజల్ రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారట. ఇదే జరిగితే దాదాపు పదేళ్ల తర్వాత వీరి జోడీ అభిమానులను అలరించనుంది. ‘సలార్’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం కాజల్ను సంప్రదించిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే పెళ్లి తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా …
Read More »పాన్ ఇండియా మూవీపై చరణ్ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో…మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ మూవీపై స్పందించిన చరణ్.. ‘చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు శంకర్ సర్. మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని శంకర్, నిర్మాత దిల్ రాజుతో …
Read More »మరోసారి తన దాతృత్వాన్ని చాటిన సోనూసూద్.
రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. దాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగులో ట్వీట్ చేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.
Read More »దర్శకుడు శంకర్ కు హైకోర్టులో ఊరట
ప్రముఖ దర్శకుడు శంకర్ కు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.దర్శకుడు శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ‘భారతీయుడు 2′ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్నే కోర్టు కొట్టివేసింది.
Read More »పాన్ ఇండియా మూవీ తీయనున్న శేఖర్ కమ్ముల
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ధనుష్ను ఈ సినిమా నిర్మాతలు, శేఖర్ కమ్ముల కలిశారు. స్టార్ హీరో అయినప్పటికీ తన దర్శకుడు, నిర్మాతల పక్కన.. చేతులు కట్టుకుని ఉండటంతో ధనుష్ సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు.
Read More »