యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.. తెలుగులో మరో క్రేజీ ఆఫర్ను కొట్టేసినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’కు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు. కొరటాల గత చిత్రాలకు DSP సంగీతమందించాడు.
Read More »పోరాటాలకు సిద్ధమవుతున్న సారా అలీఖాన్
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పోరాటాల కోసం సిద్ధమవుతోంది. గుర్రపు స్వారీ, విలువిద్యలో ట్రైనింగ్ తీసుకుంటోంది. అయితే, ఇదంతా ఓ చిత్రంలో పాత్ర కోసమేనట. ఇటీవల ఆమె విక్కీకౌశల్తో ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ చిత్రాన్ని ఒప్పుకుంది. ఇందులో సారా పోషించబోయే పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. అందుకే ఈ పాత్ర కోసం ఆమె కొన్ని నెలలుగా కసరత్తులు చేస్తోంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
Read More »మధుప్రియకు తప్పని వేధింపులు
తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సింగర్ మధుప్రియ ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులు దర్యాపు చేపట్టారు.
Read More »మెగా పవర్ స్టార్ తో త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు
మహేష్ బాబుతో మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్తో సినిమా చేసేందుకు స్క్రిప్టును సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘RRR’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత శంకర్ మూవీలో కన్పిస్తాడు. ఆ తర్వాతే వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More »కృతిశెట్టికి అలాంటి మగాళ్లే ఇష్టం
తొలి సినిమాతోనే హిట్ అందుకుని ప్రస్తుతం బిజీ హీరోయిన్ మారిపోయిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో మగాళ్ల గురించి మాట్లాడింది. అబద్ధాలు చెప్పే వారంటే తనకు నచ్చరింది. తాను ఎదురుచూసే మగాడు నిజాయితీగా, బోల్డ్ గా, తనకు ఏదైనా ముఖం మీద చెప్పే ధైర్యం గల వ్యక్తిగా ఉండాలంది.
Read More »అదే మెగాస్టార్ గొప్పతనం
తనకు ఆర్థికంగా సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవికి నటుడు పొన్నాంబళం కృతజ్ఞతలు తెలిపాడు. ‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం. చాలా థ్యాంక్స్ అన్నా. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రూ. 2 లక్షలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీ పేరుతో ఉన్న ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని మనసారా కోరుకుంటున్నా’ అని పొన్నాంబళం పేర్కొన్నాడు.
Read More »4రోజులు నిద్రపోని హాట్ బ్యూటీ..ఎందుకంటే..?
గతంలో లీకైన తన న్యూడ్ వీడియో గురించి హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి స్పందించింది. ఆ వీడియో తనది కాదని ఎవరో కావాలని సృష్టించారని గతంలోనే ఆమె క్లారిటీ ఇచ్చింది. తాజాగా.. ఆ వీడియో వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయాను. 4 రోజులు బయట అడుగుపెట్టలేకపోయానని తెలిపింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
Read More »పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త
టాలీవుడ్ స్టార్ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్, పవన్ సినిమాకు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో పవన్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ఇందులో ఐబీ ఆఫీసర్గా, లెక్చరర్గా పవన్ నటించనున్నారని సమాచారం. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోలో రానున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read More »కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించారు బీఏ రాజు. మహేశ్‌బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 23 మంది మరణించారు. 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,44,263గా ఉంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,757. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3060 మంది చనిపోయారు. జిల్లాల వారీగా …
Read More »