Breaking News
Home / MOVIES / ‘సర్కారు వారి పాట’ లో సముద్రఖని

‘సర్కారు వారి పాట’ లో సముద్రఖని

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇందులో ‘క్రాక్’ మూవీ విలన్ సముద్రఖనిని తీసుకున్నట్టు తాజా సమాచారం. నిన్నా, మొన్నటి వరకు ‘సర్కారు వారి పాట’లో మహేష్‌ని ఢీకొట్టే విలన్ పాత్రకి సీనియర్ నటుడు అర్జున్‌ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలన్ని వట్టి పుకార్లేనని, ‘అలవైకుంఠపురములో’, ‘క్రాక్’ సినిమాలలో తన విలనిజంతో ఆకట్టుకున్న సముద్రఖని ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. చిత్ర బృందం ఈ విషయాన్ని ఇంకా అధికారకంగా వెల్లడించనప్పటికీ నెట్టింట మాత్రం ఇది వైరల్ అవుతోంది.

ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు

aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma