ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే నాని, రామ్ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడుకు.. తాజాగా మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం వరించినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ తో అనిల్ రావిపూడి ఓ మూవీ చేయనున్నాడని ఇన్ సైడ్ టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ సొట్టబుగ్గల సుందరిని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది
Read More »టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు కలవరం
డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉప విభాగం పోలీసులు హీరో తనీష్ తో పాటు మరో ఐదుగురికి నోటీసులిచ్చారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు అందిన వారిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత శంకర గౌడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన కార్యాలయాల్లో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తనీష్ 2017లో జరిగిన డ్రగ్స్ కేసులో HYD సిట్ …
Read More »విలన్ గా భూమిక
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వరస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘వైల్డ్ డాగ్’ APR 2న రాబోతుండగా ‘బంగరాజు’తో పాటు మరో ప్రాజెక్టును సెట్స్ మీదకి తీసుకొస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ భూమిక విలన్ గా నటించనుందట. ఇది ‘నరసింహా’లో నీలాంబరి తరహా పాత్రని సినీటాక్. కాగా గతంలో వీరిద్దరు నటించిన స్నేహమంటే ఇదేరా’ ఫ్లాప్ అయింది. మరి ఈసారి వీరి కాంబో ఎలా …
Read More »మహాత్మా గాంధీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈసారి మహాత్మా గాంధీని టార్గెట్ చేసింది. ‘గాంధీ తన సొంత బిడ్డలను వేధించారు. అతిథుల టాయిలెట్లు శుభ్రం చేయలేదని తన భార్యను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు కథనాలు ఉన్నాయి. అయినప్పటికీ గాంధీ జాతిపిత అయ్యారు. గాంధీ మంచి భర్త, తండ్రి కాకపోయినా.. దేశంలో ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అని ట్విట్టర్ లో …
Read More »కంగనా రనౌత్ పై కేసు నమోదు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. ‘కాశ్మీర్ కీ యోధ రాణి దిద్దా పుస్తక రచయిత ఆశిష్ కౌల్. ఆమెపై ఫిర్యాదు చేశారు. కంగన కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టును ఆశ్రయించారు. గతేడాది ‘పంగా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘ధాకడ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది
Read More »హాట్ భామ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే ఫిట్ నెస్ పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘ఫిట్ నెస్ అంటే మనకు కనిపించే శరీరం మాత్రమే కాదు. బయటికి కనిపించే శరీరాన్ని బట్టి వ్యక్తి ఫిట్ నెస్ నిర్ధారించలేం. మానసిక ఆరోగ్యంగా ఉండటమే అసలైన ఫిట్ నెస్ బాడీ, మనస్సుకు మధ్యలో ఉండే సమతుల్యతే దానికి అర్థం చెబుతుంది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రభాస్ మూవీ షూటింగ్ …
Read More »‘జాతిరత్నాలు మూవీకి తొలిరోజే షాక్
ఇటీవల విడుదలై తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘జాతిరత్నాలు మూవీకి పైరసీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది విడుదలైన తొలి రోజునే ఈ మూవీ పైరసీ వర్షన్ ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చింది. అటు టెలిగ్రాం గ్రూపుల్లోనూ ఈ మూవీ పైరసీ వర్షన్ దర్శనమిచ్చింది ఇది చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది
Read More »150కోట్లతో పవన్ మూవీ..?
జనసేన అధినేత,పవర్ స్టార్ ,సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మూవీని రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ స్థాయిలో పవన్ మూవీ తెరకెక్కనుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కోసం చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం పోర్టు వంటి సెట్లను ప్రత్యేకంగా వేస్తున్నారు. ఇక ఈ పీరియడ్ డ్రామా వీఎఫ్క్స్(VFX) వర్క్స్ కోసం 6 నెలలు …
Read More »RRR హాట్ బ్యూటీ అలియా భట్ కు కరోనా నెగిటివ్
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమైన RRR హాట్ బ్యూటీ అలియా భట్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. తన ప్రియుడు, హీరో రణ్ బీర్ కపూర్ కు తాజాగా కరోనా బారిన పడటంతో ఈ అమ్మడు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లింది. ఇటీవలే ఈ ప్రేమపక్షులు ‘బ్రహ్మాస్త్ర షూటింగ్ తో పాటు …
Read More »సంచలన వ్యాఖ్యలు చేసిన గోవా బ్యూటీ
గోవా బ్యూటీ ఇలియానా బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన బాడీలో తనకే నచ్చని భాగాలు ఉన్నాయని ఈ బ్యూటీ ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది. తన శరీరంలో ఎదభాగం తనకు నచ్చదని చెప్పింది. తన చేతులు సన్నగా ఉంటాయని, ముక్కు, పెదాలు కూడా సరిగ్గా ఉండవని, చూడ్డానికి పొడవుగా కనిపించనని, పైగా నల్లగా ఉంటానంటూ ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది
Read More »