నెపాటిజం అంటే బంధుప్రీతి. తమ వాళ్లకు అవకాశమిచ్చి.. ఇతరులను అణగదొక్కడం! బాలీవుడ్లో కొనసాగుతున్నఈ ధోరణే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. బాయ్‌కాట్ ఫేక్‌స్టార్స్.. బాయ్‌కాట్ బాలీవుడ్.. నెపాటిజమ్ కిల్స్ సుశాంత్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్లో అగ్రశేణి నటులకున్న విలువ స్వయంకృషితో ఎదిగిన యాక్టర్స్‌కు లేదని, బాలీవుడ్ సినిమాలు చూడడం ఆపేసి, వెబ్ సిరీస్, టాలీవుడ్, హాలీవుడ్ ఫిల్మ్స్ చూడడం ఉత్తమమని …
Read More »సుశాంత్ కుటుంబంలో మరో విషాదం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్‌ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆయన మృతి ఎందరికో తీరని విషాదాన్ని కలిగించింది. సెలబ్రిటీలు, అభిమానులు సుశాంత్ మరణాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ వదిన సుధ..ఆయన మరణాన్ని తట్టుకోలేక సోమవారం కన్నుమూశారు. సుశాంత్ మరణించాడన్న వార్త తెలిసినప్పటి నుండి సుధా కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టలేదట. ఈ క్రమంలో సుధా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృత్యువాత పడింది. …
Read More »సుశాంత్ ది హత్యేనంటా..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సుశాంత్ కుటుంబ సభ్యులతో భేటీ అయిన పప్పు యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన …
Read More »టీడీపీ మాజీ ఎంపీ ఇంట్లో కరోనా కల్లోలం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. మురళీమోహన్ కుమారుడి ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్దరు భార్యా భర్తలు, కాగా, మరో మహిళ వంట మనిషిగా పని చేస్తోంది. టోలిచౌకికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి, బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉంటున్న మరో యువతికి …
Read More »ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియ
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’.. దీనిలో కథానాయిక శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే అంశం గురించి ఈ ముద్దు గుమ్మ సోషల్‌మీడియాలో లైవ్‌లో తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో వెల్లడించారు.‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి ఆమె ప్రస్తావిస్తూ ‘ఇందులో నా పాత్ర భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తా. …
Read More »తేజ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్
డైరెక్టర్ తేజ ఇటీవల రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘అలివేలు వేంకటరమణ’ కాగా రెండోది ‘రాక్షస రాజు.. రావణాసురుడు’. ఇందులో మొదటి చిత్రమైన ‘అలివేలు వేంకటరమణ’ చిత్రం గురించి రోజూ వార్తలు వినిపిస్తున్నాయి. అదీ కూడా అలివేలు మంగగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయమై పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తుండటం విశేషం. ముందుగా తేజ లక్కీ గాళ్ అయిన కాజల్ ఈ పాత్ర …
Read More »మీరా చోప్రా ఫిర్యాదు…మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!!
సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల సమస్యపై ట్విట్టర్లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది నటి మీరా చోప్రా. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనపై అసభ్యకర కామెంట్లు, ట్వీట్లు చేస్తున్నారని మీరా చోప్రా ఫిర్యాదు చేసింది. ఈ విషయమై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళింది. తన ట్వీట్లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నానని మీరా చోప్రా …
Read More »గుండెపోటుతో దర్శకుడు మృతి
ఇటీవల బాలీవుడ్లో ఇద్దరు లెజెండ్స్ కన్నుమూయగా, వారి మరణం చిత్ర పరిశ్రమకి తీరనిలోటుగానే ఉంటుంది. ఇక మలయాళ పరిశ్రమలోను రీసెంట్గా ఓ మలయాళ నటుడు కారు ప్రమాదంలో కన్నుమూసాడు. ఈ విషాదం మరచిపోక ముందే మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్(30) హఠాన్మరణం చెందారు. అంత చిన్న వయస్సులో ఆయన మృతి చెందడాన్ని ఆయన కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. జిబిత్ దర్శకుడిగా రాణించాలని ఎన్నో కలలు కన్నారు. కాని ఆ …
Read More »హాట్ యాంకర్ కు బాలీవుడ్ ఆఫర్.!
బుల్లితెరకి గ్లామర్ అద్దిన అందాల యాంకర్ అనసూయ. ఒకవైపు యాంకర్‌గా చేస్తూనే అడపాదడపా ముఖ్య పాత్రలు చేస్తుంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. ప్రస్తుతం అనసూయకి హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన అనసూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ఆచార్యలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన అనసూయకి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ వచ్చినట్టు …
Read More »జర్నలిస్టులకు అండగా కమల్ హసన్
కరోనా సంక్షోభంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. రోజువారి ఉపాధి లేని వారు కడుపు నింపుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ కరోనా సమయంలోను తమ ప్రాణాలని పణంగా పెట్టి విధులని నిర్వహిస్తున్నజర్నలిస్ట్‌లు కూడా కొంత ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన కమల్ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ కొందరి జర్నలిస్ట్‌లపై కూడా పంజా విసిరింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఒక్కొక్కరికి …
Read More »