Home / CRIME / సుశాంత్ ది హత్యేనంటా..

సుశాంత్ ది హత్యేనంటా..

బాలీవుడ్ యంగ్‌‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, జన్‌ అధికార్‌ పార్టీ (జేఏపీ) చీఫ్‌ పప్పు యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సుశాంత్‌ కుటుంబ సభ్యులతో భేటీ అయిన పప్పు యాదవ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తన కుమారుడు మృతిపై కుటుంబ సభ్యులు కూడా సీబీఐ విచారణకు పట్టుపడుతున్నారని తెలిపారు. ఆయన మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచుసుకుందని, హత్యా..? ఆత్మహత్యా? అనేది తేలాల్సిందని పేర్కొన్నారు.