Home / MOVIES / ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియ

ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియ

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’..

దీనిలో కథానాయిక శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే అంశం గురించి ఈ ముద్దు గుమ్మ సోషల్‌మీడియాలో లైవ్‌లో తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో వెల్లడించారు.‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా గురించి ఆమె ప్రస్తావిస్తూ ‘ఇందులో నా పాత్ర భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది.

ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తా. అజయ్‌ దేవగణ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత, అంతర్జాతీయంగా విమాన సర్వీసులు ప్రారంభించిన తర్వాత సెట్స్‌కు వెళ్తానని ఆశిస్తున్నా’ అని ఆమె అన్నారు..