పుణెలోని మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ రూపొందించిన హోమ్ ఐసోలేషన్ టెస్టింగ్ కిట్ వినియోగానికి ICMR అనుమతిచ్చింది. దీంతో ఎవరైనా సొంతంగా ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. కోవి సెల్ఫ్ అనే పేరు గల ఈ కిట్ వినియోగానికి ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్లో ఉంటూ ICMR, ఆరోగ్య శాఖ …
Read More »రోజుకు 90 లక్షల మందికి టీకా తప్పకుండా వేయాల్సిందే..లేకపోతే..?
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం ఆందోళన కల్గిస్తోందని NDTV కో-ఫౌండర్ ప్రణయ్ రాయ్ ట్వీట్ చేశారు. 4 వారాల కింద రోజుకు 22 లక్షల మందికి, 2 వారాల కింద 20 లక్షల మందికి, వారం క్రితం 19 లక్షల మందికి టీకా ఇస్తే మే 19న మాత్రం 13 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. కరోనాపై విజయం సాధించాలంటే రోజుకు 90 లక్షల మందికి …
Read More »కరోనా దెబ్బకు పడిపోయిన ప్రధాని రేటింగ్..!
ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రేటింగ్ క్రమంగా పడిపోతూ వస్తున్నది. దేశం యావత్తూ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్న తరుణంలో గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ రేటింగ్ అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ విషయాన్ని ఆమెరికాకు చెందిన ఒక సర్వే సంస్థ తన నివేదిక స్పష్టం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత …
Read More »పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనా
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనాకు పాజిటివ్‌గా పరీక్ష చేశారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. అలాగే ఆయన భార్య మీరా భట్టాచార్య సైతం వైరస్ బారినపడ్డారు. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుద్ధదేవ్ భట్టాచార్య, ఆయన సతీమణి, వారి సహాయకుడి నుంచి ఉదయం నమూనాలను సేకరించగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా …
Read More »కరోనాతో మరణించిన యూపీ మంత్రి
కరోనా మహమ్మారికి మరో రాజకీయ ప్రముఖుడు బలయ్యారు. ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో కన్నుమూశారు. 56 ఏండ్ల కశ్యప్ కరోనా బారినపడటంతో గుర్గావ్‌లోని వేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడటంతో ఆయన మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. మంత్రి ముజఫర్‌నగర్‌లోని ఛర్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, సీఎం యోగీ ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు కరోనా వల్ల మరణించారు. కశ్యప్ …
Read More »భారత్ లో కొత్తగా 2,81,386 కరోనా కేసులు
భారత్లో గడిచిన 24 గంటల్లో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463గా ఉంది. ఇక నిన్న 4106 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,74,390గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 3,78,741 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »కరోనా టీకాపై శుభవార్త
ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టీకా కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ లేదన్న కారణంతో ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదని పేర్కొంది. ఏ వ్యక్తి అయినా, లబ్ధిదారుడైనా ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందొచ్చని తెలిపింది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పింఛన్ డాక్యుమెంట్ చూయించి టీకా వేసుకోవచ్చని పేర్కొంది.
Read More »దేశ వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే
ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వే తరహా సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సేవలను వాడుకోవాలన్నారు. సెకండ్ వేవ్ గ్రామాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, దీన్ని కట్టడి చేసేలా వ్యూహాలు అమలు చేయాలన్నారు.
Read More »భారత్ లో 3,11,170 కరోనా కేసులు
భారత్ లో గడిచిన గత 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077గా ఉంది. ఇక నిన్న 4077 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,70,284గా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి
కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) కరోనాతో మరణించారు. ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డ ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. రాహుల్ గాంధీతో సతావ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు.
Read More »