దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 7,88,223కు చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 …
Read More »మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. ఆయనపై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరబ్బర్ సింగ్ ఆరోపణలు చేశారు.. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారు. కాగా ‘అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు’ కేసులో.. లంచం తీసుకోవాలని తనపై హోం మంత్రి ఒత్తిడి చేశారని …
Read More »మహారాష్ట్రలో కొత్తగా 31,643 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అక్కడ కొత్తగా 31,643 కరోనా కేసులు, 102 మరణాలు నమోదయ్యాయి దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,45,518కు, మరణాల సంఖ్య కు చేరింది. అలాగే ముంబై ఒక్క చోటే 5,890 కరోనా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »భారత్ ను భయపెడుతున్న కరోనా
భారత్ లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 62వేల కొవిడ్ కేసులు వచ్చాయి. మరో 312 మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్లో రోజు రోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న మొత్తం 62,714 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 28,739 మంది వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇంకా 4,86,310 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 62,258 కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,258 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,08,910కు చేరింది. అటు నిన్న కరోనాతో 291 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,61,240కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,52,647గా ఉంది అటు దేశంలో ఇప్పటివరకు 5.81 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు
Read More »దేశంలో కొత్తగా 59,118 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 59,118 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,26,652కు చేరింది. అటు నిన్న కరోనాతో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షలను దాటింది. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి
Read More »మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్
మహారాష్ట్రలో కరోనా ఉధృతి మరింత పెరుగుతోంది అక్కడ కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్తగా 35,952 కరోనా కేసులు, 111 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 5,504 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »దేశంలో తగ్గని కరోనా తీవ్రత
ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఇంత మొత్తంలో కేసులు నమోదవడం తొలిసారిగా.. మళ్లీ 133 రోజుల తర్వాత కొవిడ్ కేసులు అత్యధికంగా రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 1,17,87,534కు …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో మహమ్మారి ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అలాగే ఒకే రోజు పెద్ద ఎత్తున 275 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన మొత్తం కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,34,058కు పెరిగింది. మరో 23,907 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు …
Read More »టూరిజం రాష్ట్రంలో ఎలక్ర్టిక్ బస్సులు
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో ఒలెక్ర్టా గ్రీన్ టెక్ లిమిటెడ్ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకొని 50 బస్సులను సరఫరా చేసింది. ఆ రాష్ర్ట ప్రజలు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్ తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ బస్సులను మేఘా అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ రూపొందించింది. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని …
Read More »