భారత్ లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 62వేల కొవిడ్ కేసులు వచ్చాయి. మరో 312 మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.
సెకండ్ వేవ్లో రోజు రోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న మొత్తం 62,714 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 28,739 మంది వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇంకా 4,86,310 యాక్టివ్ కేసులున్నాయి.