కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి లాక్ డౌన్ పొడగింపునకు మించిన మార్గం లేదు భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయి కరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడుతున్నారు లాక్ డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య. ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. మనం ఒకసారి …
Read More »భారత్ కు ట్రంప్ వార్నింగ్
అమెరికాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో హైడ్రాక్సిక్లోరోక్వీన్ మెడిసిన్‌ను భారత్ తమకు పంపని పక్షంలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేరియా నివారణకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో… ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐతే… అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత్ ఈ …
Read More »బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఆరోగ్యం విషమం
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం విదితమే. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ జాన్సన్.. లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో జాన్సన్‌ను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోరిస్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డోమినిక్ రాబ్ వెల్లడించారు. మార్చి 27 నుంచి జాన్సన్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి …
Read More »ఒకపూట భోజనం మానెయ్యాలి-బీజేపీ కార్యకర్తలకు ప్రధాని పిలుపు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చేస్తున్న పోరులో భారతీయులందరినీ ఏకం చేసేందుకు వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్న ప్రధాని మోదీ తాజాగా భాజపా కార్యకర్తలకు మరో టాస్క్ ఇచ్చారు. నేడు భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొవిడ్‌పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానెయ్యాలన్న పార్టీ సూచనను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.నిన్న శుక్రవారం ఒక్కరోజే 647కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృవీకరించింది. గత రెండు రోజుల్లో ఢిల్లీ మర్కాజ్ తో సంబంధాలున్న 647కేసులను గుర్తించాము.అండమాన్ నికోబార్,అస్సాం,ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్ హర్యానా,జమ్ము & కాశ్మీర్,జార్ఖండ్,కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్థాన్,తమిళనాడు,తెలంగాణ,ఏపీ,ఉత్తరాఖండ్,యూపీల నుండే ఈ కేసులు నమోదయ్యాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 2301కేసులు నమోదయ్యాయి.ఇందులో యాబై ఆరు మంది మృతి చెందారు.
Read More »తమిళనాడులో కరోనా కలకలం
తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.శుక్రవారం ఒక్కరోజే 102కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రోజు 110కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో మొత్తం 411కి చేరుకుంది. మరోవైపు ఇరవై నాలుగంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 91కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 384కి చేరుకుంది.ఇందులో ఎక్కువ కేసులు అనగా 259మంది ఢిల్లీ మర్కాజ్ కి చెందినవారవడం విశేషం.
Read More »ఒకరికి కరోనా.. 54వేల మంది క్వారంటైన్
గుజరాత్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో దాదాపు 54,000 మంది ఇంట్లోనే క్వారంటైన్ కావాల్సి వచ్చింది. సూరత్‌లోని రాండర్ జోన్‌లో లాండ్రీ దుకాణం నడిపే ఓ వ్యక్తికి కొవిడ్-19 సోకింది. దీంతో ఆ దుకాణం చుట్టుపక్కల ఉన్న 16,785 ఇళ్లలో 54,003 మంది గృహ నిర్బంధంలోకి వెళ్లారు. 12 ఆస్పత్రులు, 23 మసీదులు, 22 ప్రధాన రహదారులు, 82 అంతర్గత దారులున్న ఈ ప్రాంతం మొత్తాన్ని అధికారులు క్రిమి …
Read More »11 మంది CISF జవాన్లకు కరోనా
కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ విజృంభించింది. చాప కింద నీరులా సైలెంట్ గా అటాక్ చేస్తోంది. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టులకు రక్షణ కల్పించే సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. వారేమీ విదేశాలకు వెళ్ల లేదు. అయినా వారికి కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి …
Read More »దేశంలో 14 కరోనా హాట్ స్పాట్స్
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 2301 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లిఘీ జమాత్ సదస్సుకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకడంతో కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ కేసులు పెరుగుతున్నాయన్న దానిపై కేంద్రం దృష్టిపెట్టింది. భారీగా కేసులు బయటపడుతున్న ప్రాంతాల్లో కరోనా నివారణకు …
Read More »కరోనాకు వ్యాక్సిన్ పై మరో ముందడుగు
భూమండలాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనడంలోనే ప్రపంచ శాస్తవేత్తలంతా నిమగ్నమయ్యారు. పక్కనున్నవారికి కూడా తెలియకుండాసాగే ప్రక్రియ ‘పరిశోధన’. కానీ కరోనాను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు అంతర్జాతీయంగా పరిశోధన ఫలితాలను పంచుకొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు అంచనా. ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ దాదాపు ఒకే అంశంపై పరిశోధన సాగించడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారికావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైరస్‌ను అడ్డుకోవచ్చని భావిస్తున్న రెండురకాల టీకాలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. హైదరాబాద్ …
Read More »