గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.
Read More »బీజేపీలో చేరిన దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. సైన్యంలో కల్నల్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆయన ప్రధాని మోదీ ఆలోచనా విధానం నచ్చే కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 30వేల కేసులు పెరిగాయి. ఇక కొత్తగా 491 మంది వైరస్లో మరణించారు. మరోవైపు తాజాగా 2,23,990 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది.
Read More »దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం .. మహారాష్ట్రలో 43,697 కరోనా కేసులు కర్ణాటకలో 40,499 కరోనా కేసులు కేరళలో 34,199 కరోనా కేసులు గా గుజరాత్లో 20,966 కరోనా కేసులు తమిళనాడులో 26,981 కరోనా కేసులు ఉత్తరప్రదేశ్లో 17,776 కరోనా కేసులు ఢిల్లీలో 13,785 కరోనా కేసులు ప. బెంగాల్లో 11,447 కరోనా కేసులు ఆ ఏపీలో 10,057 తెలంగాణలో 3557 కరోనా కేసులు
Read More »శ్రీలంకకు అండగా భారత్
విదేశీ మారక ద్రవ్యం కొరత, పెరిగిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు మరోసారి భారత్ సాయం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వనుంది. ఈ నెల మొదట్లో ఆ దేశానికి 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ను, గత వారం 400 మిలియన్ డాలర్లను భారత్ మంజూరు చేసింది. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు ఇబ్బందులు …
Read More »బీజేపీలోకి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. ఈయన 2017 శిరోమణి అకాలీదళ్ చేరి… అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అమరీందర్పై పటియాలా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జోగిందర్ 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. 2008-13 మధ్య అరుణాచల్ గవర్నర్ గా ఆయన సేవలందించారు.
Read More »కరోనా చికిత్సపై కేంద్రం కీలక ప్రకటన
కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ను ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా సవరించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. రోగికి స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఇవ్వడంతో బ్లాక్ ఫంగస్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కొవిడ్ సోకిన వారికి రెండు, మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే టీబీ, ఇతర పరీక్షలు చేయాలని సూచించింది.
Read More »దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ
దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకి 2లక్షలకుపైగా వస్తున్న కొత్త కేసుల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,38,018 కేసులు నమోదయ్యాయి. అయితే, నిన్నటితో పోలిస్తే.. 20,071 కేసులు తక్కువగా వచ్చాయి. కరోనాతో 310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 14.43%గా ఉంది. ఇక, ఒక్క రోజులో 1,57,421 మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Read More »ఢిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వీకెండ్ కర్ఫ్యూ, ముందస్తు ఆంక్షలు వంటి కారణాలతో కేసులు తగ్గినట్లు మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. మరో 3-4 రోజులు గమనించి.. కేసులు 15వేలకు చేరినప్పుడు ఆంక్షలు సడలిస్తామన్నారు. గత నెల రోజుల్లో రోజుకు 60 వేల నుంచి లక్ష వరకు పరీక్షలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో నిన్న 20,718 కరోనా కేసులు నమోదు కాగా.. …
Read More »Upలో Spకి రాకేశ్ టికాయత్ మద్ధతు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు జరిగిన రైతుల ఉద్యమంలో టికాయత్ కీలకపాత్ర పోషించారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఉద్యమం ఆపబోమని ప్రకటించిన టికాయత్.. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత అధికార బీజేపీ వ్యతిరేక పార్టీకి మద్దతిచ్చారు.
Read More »