CORPORATOR: వరంగల్ నగరంలో భూ కబ్జా చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు. హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్ –2లో తమ పేరు మీద ఉన్న 200 గజాల స్థలాన్ని పలుమార్లు అడిగినట్లు బాధితులు తెలిపారు. …
Read More »Minister amarnath: విశాఖపై మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలు
Minister amarnath: ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖ గురించి మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతుందని…. ఎలా అయినా విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖలో ఈరోజు ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సు జరిగింది. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. …
Read More »CHINTAKAYALA VIJAY: చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు
CHINTAKAYALA VIJAY: సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కేసులో తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టంలోని 41ఏ ప్రకారం జారీ చేసిన ఆ నోటీసుల్లో ఈనెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. భారతి పే పేరిట సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన అభియోగాలపై చింతకాయల విజయ్ పై సీఐడీ కేసు నమోదు …
Read More »VANDE BHARAT: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మురికి కూపంలా చేస్తున్నారు: రైల్వే అధికారులు
VANDE BHARAT: ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికులు మురికి కూపంలా చేస్తున్నారంటూ రైల్వే అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్ ట్రైన్’ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న సికింద్రాబాద్–విశాఖపట్నం రైలు ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక సదుపాయాలు..విమానం తరహా సీటింగ్ ఏర్పాటు చేశారు. మిగిలిన రైళ్లతో …
Read More »Fire accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో భవనంలో అస్థిపంజరం గుర్తింపు
Fire accident follow up: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో భవనంలోని మొదటి అంతస్తులో ఒక అస్థిపంజరాన్ని అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన రోజు…..భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురిలో ఆ అస్థిపంజరం ఎవరిదనేది ఇంకా తెలియలేదు. అంతకుముందు ప్రమాదం జరిగిన దక్కన్ మాల్ సమీపంలోని నల్లగుట్ట ప్రాంతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ప్రమాదం జరగడంతో భయాందోళనకు గురైనట్లు స్థానికులు వాపోయారు. ప్రమాదానికి గురైన భవనం కూలిపోతే తీవ్రంగా …
Read More »Amaravati: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం
Amaravati: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి…..అధికారులతో సమీక్ష నిర్వహించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. మంత్రులు మేరుగు నాగార్జున, బొత్స, సీఎస్, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు పీఠంతో కలుపుకుని …
Read More »CM: జోయాలుక్కాస్ ఛైర్మన్ తో సీఎం భేటీ
CM: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్స్ ఛైర్మన్ వర్గిస్ జాయ్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్…..జోయాలుక్కాస్ …
Read More »KTR: రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడులు
KTR: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 36,300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్లో అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ప్రకటనను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఏడబ్ల్యూఎస్ ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ పౌరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇ–గవర్నెన్స్, హెల్త్ …
Read More »Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిపివేత
Kamareddy Master Plan: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ నిలిపేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే బృహత్ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. బృహత్ ప్రణాళిక అంశంపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టరేట్, అదనపు కలెక్టరేట్, కమిషనర్ పాల్గొన్నారు. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే …
Read More »Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు
Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో మంటలు చెలరేగడానికి కారణం…విద్యుదాఘాతం కాదని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తలను విద్యుత్ అధికారులు ఖండించారు. మంటలు వ్యాపించే సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందని వెల్లడించారు. ఒక వేళ విద్యుదాఘాతమే జరిగి ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని….మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవని వివరించారు. ఘటనకు …
Read More »