బీజేపీ నాయకులు పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మహారాష్ట్ర నుంచి …
Read More »కొత్త రకం కరోనాపై డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ
బ్రిటన్‌లో బెంబేలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలతో ఆ వైరస్ దూకుడును అడ్డుకోవచ్చు అని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. బ్రిటన్‌లో కొత్త కరోనా శరవేగంగా విస్తరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. కొత్త వైరస్ వ్యాప్తి రేటు అధికంగానే ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం కంట్రోల్‌లోనే ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై 2 తర్వాత ఈ స్థాయిలో తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. కొత్తగా 30,376 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 96,36,487 కోలుకున్నారు. మరో 301 మృతి …
Read More »ఉత్తరప్రదేశ్‌లో ఘోరం
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ను కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. యూపీ 32 కేడబ్ల్యూ 6788 కారులో ఐదుగురు ఢిల్లీ వైపు వెళ్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఖండౌలి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో, టోల్‌ప్లాజాకు నాలుగు కిలోమీటర్ల ముందు ఓ ట్యాంకర్‌ను ఓవర్‌టెక్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో …
Read More »క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకప్పుడు అలవాటు లేని పదం కానీ ఇప్పుడు అందరికీ పరిచయం అయిపోయింది. ముఖ్యంగా రెండేళ్ల కింద మీటూ ఉద్యమం జరిగినపుడు దేశవ్యాప్తంగా ఇది ట్రెండింగ్ అయింది. దానికి తోడు తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి కూడా నానా రచ్చ చేయడంతో అమ్మో అనుకున్నారంతా. అప్పట్నుంచి ఇప్పటి వరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది ట్రెండ్ అవుతూనే ఉంది. అవకాశం ఇవ్వాలంటే మాకు కావాల్సింది ఇవ్వాలంటూ హీరోయిన్లను వేధించే …
Read More »పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంట విషాదం
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాతృమూర్తి దాసరి మధురవ్వ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మధురవ్వ మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మధురవ్వ అంత్యక్రియలు స్వగ్రామమైన కాసులపల్లి లో ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు.
Read More »రజనీకాంత్ పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు
తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజకీయాలలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించగా, సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 31న పార్టీపై అఫీషియల్ ప్రకటన చేయనున్నాడు. ప్రస్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర కసరత్తులు చేస్తున్నాడట. జనవరి 14 లేదా 17 …
Read More »ఎమ్మెల్సీ కవిత మానవత్వం
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మానవత్వం చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత వెళ్తుండగా.. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలతో పడి ఉన్న మహిళను చూసి చలించిపోయారు. గాయాలతో స్పృహతప్పడి పడిపోయిన మహిళకు ఆమె తెలంగాణ జాగృతి మహిళా నేతలతో కలిసి సపర్యలు చేశారు. అనంతరం ఆమెను వెంటనే సదరు స్థానిక టీఆర్‌ఎస్ నాయకుల సహాయంతో …
Read More »బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వెర్షన్
బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటి పోయిందంటూ ఏకంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీలాంటి దేశాలు నిషేధం విధించాయి. కరోనా కొత్త వేరియంట్ తమ దేశాల్లో అడుగుపెట్టకుండా వీళ్లు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం …
Read More »పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్
పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్. బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మండల్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తృణమూల్ పార్టీ ఎంపీ సౌగత రాయ్, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో సుజాత మండల్ తృణమూల్‌లో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. బీజేపీ కోసం కష్టపడి పని …
Read More »