కోవిడ్-19(కరోనా వైరస్)…ఇది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ వైరస్కు ఇప్పటి వరకు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అంటే ఏమిటీ? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? అది ఎక్కడ పుట్టింది? ఎలా విస్తరిస్తుంది? దాని లక్షణాలేమిటీ? అన్న అంశాలను నిశితంగా పరిశీలిద్దాం… వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ వాతావరణంలో చేరి, గాలి ద్వారా …
Read More »అమెరికాలో ప్రతి గంటకు 83మంది బలి
కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. కరోనా బారిన పడి అట్టుడుకుతున్న దేశాల్లో నిన్న మొన్నటి వరకు ఇటలీ తొలిస్థానంలో ఉండగా ఇప్పుడు అమెరికా ఈ స్థానానికి ఎగబాకింది. కరోనా మృతుల సంఖ్య సహా పాజిటివ్ కేసుల్లోనూ అమెరికా ముందు వరుసలో నిలవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్-19 వైరస్ సోకిన వారిలో గంటకు 83 మంది చొప్పున పిట్టల్లా రాలిపోతున్నట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఆదివారం …
Read More »కేంద్ర మాజీ మంత్రి మృతి
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎంవీ రాజశేఖరన్ సోమవారం ఉదయం కన్నుమూశారు. 91 ఏళ్ల వయసున్న రాజశేఖరన్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సారధ్యంలోని కాంగ్రెస్ కేంద్ర సర్కారులో కేంద్ర ప్రణాళిక శాఖ సహాయమంత్రిగా పనిచేసిన రాజశేఖరన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. రాజశేఖరన్ మృతి పట్ల కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంతాపం తెలిపారు. …
Read More »ఖమ్మం జిల్లాలో ఎనిమిదేళ్ళ బాలికకు కరోనా..! ఎలా వచ్చిందంటే..?
తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఖమ్మంలో కరోనా ప్రభావం లేదు. అంతా సేఫ్ అని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజలు భావిస్తున్న సమయంలో కలవరం మొదలైంది. శనివారం వరకు నాలుగు పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆదివారం ఓ ఎనిమిదేళ్ల బాలికకు లక్షణాలున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం ఖిల్లాకు చెందిన ఆ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరికి కరోనా రాగా.. అదే కుటుంబానికి చెందిన బాలికకు లక్షణాలు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు. …
Read More »కామారెడ్డిలో 12కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. తాజాగా వచ్చిన 22 మంది రిపోర్టుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు బాన్సువాడలోనే 11 కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను అధికారులు మరింత అప్రమత్తం చేస్తున్నారు.
Read More »ప్రజలు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
కరోనా వైరస్ మహమ్మారి ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ప్రపం చం, దేశం, తెలంగాణలోనూ వ్యాప్తి చెందుతున్నదని, ప్రజలు ఇంతకుముందుకంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తిచేశారు. అప్రమత్తతే కొవిడ్ కట్టడికి ఆయుధమని పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకినవారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »కరోనా వేళ ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు
తెలంగాణలో కొవిడ్-19 లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. గంటకొట్టినట్టే అంగన్‌వాడీల ద్వారా గర్భిణుల ఇంటి కి ఠంచన్‌గా పౌష్టికాహారం చేరుతున్నది.. గర్భిణుల ఆరోగ్య స్థితిపై ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు వాకబుచేస్తూ సూచనలిస్తున్నారు.. ఆపత్కాలం లో అమ్మఒడి వాహనాలు గడప ముందుకొస్తున్నాయి. కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులపై మరింత నమ్మకం ఏర్పడింది.. ఫలితంగా ఏప్రిల్, మే నెలల్లో వందశాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతాయని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ అంచనా వేస్తున్నది. …
Read More »24గంటలు అందుబాటులో ఉంటా
తాను 24×7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో కొవిడ్-19 పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో …
Read More »ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగ రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) గా జస్టిస్ కనగ రాజు నియమితులయ్యారు. జస్టిస్ కనగరాజు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ కాలం ముగిసింది.
Read More »కరోనా వ్యాప్తి నిరోధానికి ఇదే స్ఫూర్తి కొనసాగాలి
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడంతోపాటు వారితో కలిసినవారిని గుర్తించి, క్వారంటైన్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరికోతలు, ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలు, వ్యవసాయ …
Read More »