తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంటిఇంటికెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియా నుండి కరీంనగర్ కు వచ్చిన పదకొండు మంది ప్రచారకుల్లో ఏడుగురికి కరోనా పాజిటీవ్ అని తేలడంతో అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి రామగుండం వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్లో వాళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎస్ 9 బోగీలో ఉన్నవాళ్లందరూ పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అటు నగరంలో 144సెక్షన్ …
Read More »మీకు రేషన్ కార్డు ఉందా..?
మీకు రేషన్ కార్డు ఉందా..?. అయితే ఇది నిజంగా శుభవార్తనే. ప్రస్తుతం దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆరునెలల సరుకులను ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావంతో జన జీవనం ఇబ్బందికరంగా మారింది. పేదలకు ఇబ్బంది కలగకుండా బియ్యం,గోధుమలు,పంచదార,నూనె తదితర వస్తువులను తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రాం విలాశ్ పాశ్వాన్ వెల్లడించారు. …
Read More »కరోనా భయంతో ఆత్మహత్య
ప్రపంచంలో చాలా దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో ఈ వైరస్ తనకు సోకిందనే అనుమానంతో ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచితే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరోనా టెస్టుల్లో అనుమానంగా ఉన్న వ్యక్తిని సప్దర్ జంగ్ ఆస్పత్రిలోని ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే …
Read More »ఒక్క రోజే 12 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. అటు బెంగళూరులో రెండు,నోయిడాలో మరో కొత్త కేసు నమోదు అయింది. మొత్తంగా దేశం మొత్తం ఒక్క రోజులోనే పన్నెండు కొత్త కేసులు నమోదవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ,కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.
Read More »చంద్రబాబు రాజకీయ క్రీడలో నిమ్మగడ్డ రమేష్ బలిపశువు కావడం ఖాయమా !
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లుగా బుధవారం ఓ లేఖ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల టీవీ మీడియాలో ఆ లేఖ వైరల్ అయ్యింది. అసలు రమేశ్ కుమార్ ఆలేఖ రాశారో లేదో కూడా స్పష్టం కాలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు భారీగా జరిగాయని, ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం ప్రభావం పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ …
Read More »కరోనాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విదితమే. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనుకూలమైన ప్రాంతాల్లో ఒకటి అయిన ఆర్టీసీ బస్సులలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ప్రతి బస్సులోనూ శానిటైజర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది ప్రభుత్వం. బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకి ఘన స్వాగతం
తెలంగాణ లో కామారెడ్డి జిల్లా టేక్రియాల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎంపీ కవితకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నిజామాబాద్‌కు బయలుదేరిన కవితకు దారిపొడవునా టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందల్వాయి వద్ద కూడా పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కవిత …
Read More »తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. బ్రిటన్ దేశం నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు రీపోర్ట్ వచ్చిందని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటికే ఐదు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక వ్యక్తి కోలుకుని గాంధీ ఆస్పత్రి నుండి డిశార్జి అయ్యాడు.
Read More »తగ్గిన బంగారం ధరలు
ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు బుధవారం కిందకు దిగోచ్చాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరమైన హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బుధవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920తగ్గి రూ.42,300వద్ద కొనసాగుతుంది. ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.38,700కు పడిపోయింది. మరోవైపు వెండి ధర రూ.41,780కి పతనమయింది. జూవెల్లర్ల నుండి డిమాండ్ తగ్గడమే బుధవారం బంగారం ధరలు తగ్గడానికి …
Read More »చిరు ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్
దేశంలోని చిరు ఉద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)రూల్స్ ను సవరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే నెలకు రూ.15వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ స్కీమ్ ను తీసివేసేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కూడా ఈ …
Read More »