Home / NATIONAL / చిరు ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్

చిరు ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్

దేశంలోని చిరు ఉద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)రూల్స్ ను సవరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

ఇందులో భాగంగా కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే నెలకు రూ.15వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ స్కీమ్ ను తీసివేసేందుకు కసరత్తు చేస్తోంది.

సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇటీవల జరిగిన సీబీటీ సమావేశంలో కూడా ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.