మణిపూర్‌లో నెలకొన్న శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో, మణిపూర్ లోని తెలంగాణ విద్యార్థులు, మణిపూర్‌లో నివసిస్తున్న ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.మణిపూర్ రాష్ట్రంలోని పరిస్థితిని పర్యవేక్షించడానికి, మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ తెరవబడింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్ మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. తెలంగాణ విద్యార్థులను ఇంఫాల్ …
Read More »అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకం
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ ల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి 99వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ పై ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. …
Read More »ఉద్యోగులకు మీషో షాక్
సంస్థ నిర్వాహణ లో భాగంగా వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ప్రతినిధి నిన్న శుక్రవారం వెల్లడించారు. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే ఈమెయిల్ పంపించారు.ఈ …
Read More »గాయాల వీణపై అభివృద్ధిరాగాలు
నాడు అశోకుడు చెట్లు నాటించాడనేది ఒక చరిత్ర..కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారనేది మరో గొప్ప చరిత్ర.. ఇవన్నీ మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఎన్ని తరాలైనా ఆ చరిత్ర పదిలంగా ఉన్నది. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ సృష్టించిన చరిత్ర గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. నాయకులు అందరూ అవుతారు. కానీ ప్రజల మనసుల్లో, భావితరాలకు ఆదర్శంగా నిలిచి చరిత్ర సృష్టించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైంది. …
Read More »సిద్దిపేట జిల్లాలొ దారుణం
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో ఓ విషాదం చోటుచేసుకున్నది. పొట్లపల్లి గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు చేశాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమి నలుగురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు. భార్య ఈరవ్వ 30 ఏండ్ల క్రితం చనిపోయింది. కొడుకులు ఒక్కో చోట స్థిరపడ్డారు. పొట్లపల్లిలో ఇద్దరు, హుస్నాబాద్‌లో ఒకరు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి …
Read More »నేడు మహబూబ్ నగర్ కు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్‌ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఎంవోయూలు కుదుర్చుకుంటారు. ఆయా కంపెనీలకు ఐటీ టవర్‌లో స్థలాన్ని కేటాయిస్తారు. అనంతరం కారిడార్ వెనుక భాగంలో సుమారు 270 ఎకరాల్లో నిర్మించనున్న అమరరాజా లిథియం …
Read More »వాట్సాప్ యూజర్లకు శుభవార్త
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త పీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ పీచర్ లో భాగంగా వాట్సాప్ లో సింగిల్ ఓట్ పోల్స్, సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ యువర్ చాట్స్, స్టే అప్‌డేటెడ్ ఆన్ పోల్ రిజల్ట్స్ అనే మూడు ఆప్షన్లను తీసుకువస్తున్నట్టు తెలిపింది. క్రియేట్ సింగిల్ ఓట్ పోల్స్ ఆప్షన్ ద్వారా పోల్స్‌లో ఒక్కరు ఒకేసారి ఓటు వేసే అవకాశం …
Read More »స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ?. అయితే ఇది మీకోసమే. ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ సెల్‌ఫోన్ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒప్పో, కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. సెల్‌ఫోన్ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం…సెల్‌ఫోన్ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 65 …
Read More »జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ పై సీబీఐ దాడులు
ప్రముఖ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిన్న శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ప్రముఖ బ్యాంకు అయిన కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది. ఇందులో భాగంగానే దేశంలో ఉన్న ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని …
Read More »తెలంగాణలో మరో కొత్త పథకం
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం కోసం ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం అందించనున్నారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంగుల ఫైల్ పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి నెల 35,700 అంగన్వాడీ కేంద్రాలకు 2121 టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. 5.25లక్షల మంది చిన్నారులకు, 3.75లక్షల మంది గర్భిణులు, బాలింతలకు చేకూరనుంది.
Read More »