Home / BUSINESS / జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ పై సీబీఐ దాడులు

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ పై సీబీఐ దాడులు

ప్రముఖ విమానయాన సంస్థ అయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిన్న శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది.

ప్రముఖ బ్యాంకు అయిన కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్‌ గోయల్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది.

ఇందులో భాగంగానే దేశంలో ఉన్న  ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని జెట్‌ ఎయిర్‌వేస్‌ పాత కార్యాలయాల్లో, సంస్థ మాజీ అధికారుల ఇండ్లల్లో సీబీఐ సోదాలు చేపట్టింది.

దేశంలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థగా ఎదిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ అప్పుల భారంతో 2019 ఏప్రిల్‌లో కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ సంస్థను జలన్‌ కాల్‌రాక్‌ కన్సార్టియం టేకోవర్‌ చేసింది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat