Home / EDITORIAL / గాయాల వీణపై అభివృద్ధిరాగాలు

గాయాల వీణపై అభివృద్ధిరాగాలు

నాడు అశోకుడు చెట్లు నాటించాడనేది ఒక చరిత్ర..కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారనేది మరో గొప్ప చరిత్ర.. ఇవన్నీ మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఎన్ని తరాలైనా ఆ చరిత్ర పదిలంగా ఉన్నది. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్‌ సృష్టించిన చరిత్ర గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. నాయకులు అందరూ అవుతారు. కానీ ప్రజల మనసుల్లో, భావితరాలకు ఆదర్శంగా నిలిచి చరిత్ర సృష్టించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైంది.

కేసీఆర్‌ సాధించిన విజయాలు ఒకటా? రెండా? ఆయన సాధించిన ఘనతలు మరో చరిత్రను లిఖించాయనటంలో సందేహం లేదు. బలమైన రాజకీయ పార్టీలను ధిక్కరించి పిడికెడు మందితో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించడమే ఒక చరిత్ర.నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా నిలిచి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమూ చరిత్రే. స్వరాష్ట్రంలో రెం డు జాతీయ పార్టీలు, ఒక బలమైన ప్రాంతీయ పార్టీకి ఎదురొడ్డి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కేసీఆర్‌ సృష్టించిన మరో చరిత్ర.

సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చినప్పుడే సార్థకత అని నమ్మి ఉద్యమ ప్రధాన లక్ష్యమైన నీళ్ళకోసం కాకతీయుల చరిత్రను గుర్తు చేస్తూ మిషన్‌ కాకతీయ పేరుతో పూడుకుపోయిన చెరువులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన ఆధునిక కాకతీయుడు కేసీఆర్‌. చెరువంటేనే కులవృత్తులకు నెలవు. ఊరి చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది.అందుకే చెరువులు బా గు చేసి కరువును దూరం చేసిన ఘనత కేసీఆర్‌ది. గోదావరి నదిని సజీవంగా ఉంచేలా మన నీళ్లను మనబీళ్ళకు మళ్లించాలనే ఉద్యమ నినాదంలో భాగంగా కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మించారు కేసీఆర్‌. నిర్మించిన ప్రాజెక్ట్‌ నీళ్ళతో గోదావరిని ఎదురెక్కించి తడారిన పొలాలకు మళ్లించి, తండ్లాడిన రైతన్నల కన్నీళ్ళు తుడిచి బంగారు పంటలు పండేలా చేశారు కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఒక చరిత్ర.
రాష్ట్రం సాధించిన మూడేండ్లలోనే కరెంట్‌ కష్టాలు తీర్చేందుకు కృషి చేసి 24గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌ ఇచ్చి దేశంలో ప్రకంపనలు తీసుకువచ్చిన ఘన త కేసీఆర్‌ది. కరెంట్‌తోనే ఆగిపోకుండా రైతుబంధుతో రైతుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తూ దేశం లో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించారు. రైతు మరణిస్తే రైతుబీమాతో ఆ కుటుంబానికి భరోసానిస్తున్నారు. ఒకప్పుడు అప్పుల వ్యవసాయం ఇప్పుడు పండుగైంది. తెలంగాణ నేడు కోటి ఎకరాల మాగాణమైంది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణయ్యింది. ఇదీ కేసీఆర్‌ సృష్టించిన అరుదైన చరిత్ర.

పరిపాలన వికేంద్రీకరణ కోసం 10 జిల్లాల తెలంగాణను 33 కొత్త జిల్లాలగా ఏర్పాటు చేసి, ప్రతీ జిల్లాలో ప్రజలు ఆత్మగౌరవంగా తలెత్తుకునేలా అద్భుతమైన పరిపాలన సముదాయాలు నిర్మించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేశారు. గ్రామ గ్రామా న రోడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనా లు, నర్సరీలు, రోడ్లు. ఇరువైపుల హరితహారం చెట్లతో నేడు ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతతో స్వాగతం పలుకుతున్నది. ఇది కదా కేసీఆర్‌ సృష్టించిన చరిత్ర.

హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మించిన తెలంగాణ సచివాలయం దేశానికే ఆదర్శం. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నది సెక్రటేరియట్‌. దానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం అని పేరు పెట్టటం హర్షణీయం. దీనిని నిజంగా ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నిర్మాణాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

‘హైదరాబాద్‌లో ఉండే వ్యక్తి ఏ నీళ్ళు తాగుతారో, ఆదిలాబాద్‌ గోండు గూడెం బిడ్డ అవే నీళ్ళు తాగుతా రు’ అన్న మాటలను నిజం చేస్తూ మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌ది. నిజంగా ఇది ఒక భగీరథ ప్రయత్నమనే చెప్పాలి. ఒకనాడు నల్లగొండలో ఫ్లోరైడ్‌ రక్కసితో, వంకరబోయిన కాళ్ళు చేతులతో జీవచ్ఛవాలుగా మారిన కన్నీటి గాథలెన్నో. కానీ నేడు మిషన్‌ భగీరథ ద్వారా నీళ్ళ కష్టం తీరి ఫ్లోరైడ్‌ రహిత సమాజం నిర్మితమైంది. ఆడబిడ్డలు బిందెలు మోసే భారం లేకుండా మిషన్‌ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్ళిచ్చి నీళ్ళ కష్టాలు తీర్చిండు కేసీఆర్‌..ఇది కేసీఆర్‌ సృష్టించిన చరిత్ర..

ఒకనాడు సర్కారు దవాఖానలకు పోవాలంటే జనం ఆసక్తి చూపేవారు కారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సర్కారు దవాఖానాలను బలోపేతం చేయటం ద్వారా ప్రభుత్వ వైద్యంపై భరోసా పెంచారు. గర్బిణీలకు పౌష్టికాహారం, డెలివరీ అయ్యాక కేసీఆర్‌ కిట్‌ లాంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చారు. వైద్యవిద్య కోసం రాష్ట్రంలో జిల్లాకో మెడికల్‌ కళాశాల, ప్రజలకు చేరువలోనే డయాలసిస్‌ సెంటర్లు, గర్బిణీలకు న్యూట్రీషన్‌ కిట్స్‌,ఆడపిల్లలకు హెల్త్‌ కిట్స్‌ ఇలా సర్కారు వైద్యా న్ని బలోపేతం చేసి పేదలకు వైద్యాన్ని చేరువ చేసిండు.

పేద పిల్లలకోసం సంక్షేమ గురుకులాలు ఏర్పాటు చేసి కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా విద్యనందిస్తున్నా రు. సర్కారు బడుల్లో సన్నబియ్యం భోజనం కేసీఆర్‌ సృష్టించిన చరిత్ర.యాదాద్రి పునర్నిర్మాణం ఒక అద్భుతం. నాటి యాదగిరి గుట్టకు నేటి యాదాద్రికి తేడాను ప్రజలు గమనిస్తున్నారు. దేశం గర్వించేలా ఈ ఆలయాన్ని కృష్ణ శిలలతో తీర్చిదిద్దారు. వెయ్యేండ్లు గడిచినా చెరిగిపోని కేసీఆర్‌ సృష్టించిన నూతన చరిత్ర ఇది.

మరోవైపు 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్ఠింపజేశారు. రాష్ట్ర సాధనలో నేలకు ఒరిగిన అమరులను స్మరిస్తూ భవిష్యత్‌ తరాలకు గుర్తుండేలా అమరుల స్మృతి చిహాన్ని ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో అద్భుతంగా నిర్మించారు. దళితుల కోసం ‘దళితబంధు’ దేశ చరిత్రలోనే ఒక అద్భు త పథకం. ఇది కేసీఆర్‌ సృష్టించిన మరిచిపోలేని చరిత్ర.హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా సీఎం కేసీఆర్‌ నిర్మించిన తెలంగాణ సచివాలయం దేశానికే ఆదర్శం. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నదీ సెక్రటేరియట్‌. దానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం అని పేరు పెట్టటం హర్షణీయం.ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్‌ వేసే ప్రతి అడుగు చరిత్రే. భావితరాలు గుర్తుంచుకునేలా కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రతి పథకం, నిర్మించిన ప్రతి నిర్మా ణం చరిత్రనే. రేపు దేశంలోనూ ఇలాం టి అద్భుతాలతో మరో చరిత్ర సృష్టిస్తారనడంలో సందేహం లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri eburke.org deneme bonusu veren siteler casino casino siteleri bahis siteleri takipçi satın al casino siteleri bahis siteleri