సీఎం కేసీఆర్‌తో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి మహమూద్ అలీకి శాఖను కేటాయించారు. ఆయనకు హోం శాఖను కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో అలీ డిప్యూటీ సీఎంగా, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.ఈ రోజు రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
Read More »కేసీఆర్ ఇంకో స్కెచ్..కాంగ్రెస్ నేతలకు నిద్ర కరువు
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు సర్కారు ఏర్పాటులో బిజీబిజీగా ఉంటే…మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని అంటున్నారు. ఆయన మీడియా చిట్‌చాట్‌లో కేసీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ పట్ల పలువురు ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. త్వరలో వీరి చేరికలు ఉంటాయని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ …
Read More »తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్, మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరూ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్. గవర్నర్ నరసింహన్ దంపతులతో కలసి కేసీఆర్, మహమూద్ అలీ కుటుంబసభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమానికి కొత్తగా …
Read More »రెండోసారి సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి ఘనవిజయం
సూర్యాపేట శాసనసభ ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పై అపార నమ్మకం ఉంచారు. ఓటింగ్ జరిగన తరువాత ఎవరికి వారు నాకు మెజార్టీ వస్తుంది, నాకు మెజార్టీ వస్తుంది అంటు ఎవరికి వారు లెక్కలు వేసిన ఓటరు మాత్రం జగదీష్‌రెడ్డికే ఓటు వేసి అండగా నిలిచారు. సూర్యాపేట పట్టణంలో 52,418 ఓటు వేయగా ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డికి 20,152 మంది ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి …
Read More »వరంగల్ తూర్పులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం ఎగురవేశారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రపై ప్రతిరౌండ్‌లో ఆధిక్యత సాధించారు. బీజేపీ అభ్యర్థి కుసుమ సతీశ్ డిపాజిట్ గల్లంతు అయింది. మహా కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీజేఎస్ అభ్యర్థి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కనీసం ఏ రౌండ్‌లోనూ ఆయన మూడంకెల ఓట్లు సాధించలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోయారు.అన్ని బూత్‌ల లో, ప్రతి రౌండ్‌లో నన్నపునేని నరేందర్ …
Read More »వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ ఘనవిజయం
తెలంగాణలో 119 నియోజకవర్గాలలో వర్ధన్నపేట ఒక్కటి.వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ గెలుపు ఓ అద్భుతమని నియోజకవర్గంలో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో అరూరికి బలమైన శ్రేణులు, ఉద్యమకారులు, కార్యకర్తలు బాసటగా నిలిచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో రెండో స్థానం సాధించడానికి సరిపడా బంఫర్ మెజారిటీ ని అందించడం మహాద్భుతంగా చెప్పుకోవచ్చు. అరూరి రమేశ్ గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నేటి …
Read More »జగన్ కు అసదుద్దీన్ మద్దతిచ్చినందుకు వైసీపీ అభిమానులు ఏం చేసారో తెలుసా.?
ఏపీలో అధికార టీడీపీకి ఘోర పరాజయం తప్పదంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. చంద్రబాబుపై వ్యతిరేకత ఉందని, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తాను ఏపీలో అడుగుడు పెడతానని, జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయాలపై మాట్లాడిన అసద్.. దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు …
Read More »జగన్ దెబ్బకు టీడీపీ ఔట్..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..మాజీ చైర్‌పర్సన్
టీడీపీకి కంచుకోట అయిన శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వేలాది మంది జనం జగన్ తో పాటు అడుగులో అడుగు వెయ్యడంతో ఆమదాలవలస ప్రాంతమంతా జనజాతరైంది. భానుని ప్రతాపం పెరుగుతున్న, అలుపెరగని యోధుడిలా జగన్ ఉత్సాహంగా ముందుకు సాగుతూ ప్రజలకు భవిష్యత్ భరోసాను ఇచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. బుధవారం జరిగిన యాత్ర …
Read More »సిద్ధాంతపరంగా, చంద్రబాబుపై నమ్మకం లేక, ఓటమి భయం ఈ మూడు కారణాలతో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో తెలుసా.?
ఏపీలో నియోజకవర్గ పునర్విభజన లేనట్లేనని తేలిపోయింది.. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు వికటించడంతో ఏపీలోనూ పొత్తు ఉంటుందని భావిస్తున్న టీడీపీపై అభిమానం ఉన్న నేతలు ఆపార్టీని వీడేందుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మిగిలిపోయిన కాంగ్రెస్ నేతలు సీనియర్ టీడీపీ నేతలు సుముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ లో బలమైన నేతలుగా గుర్తింపుపొంది విభజనానంతరం స్థబ్ధుగా ఉన్న అనేకమంది కాంగ్రెస్ నేతలు జగన్ పార్టీ వైపు …
Read More »కేసీఆర్ ఆ సమయంలోనే ఎందుకు ప్రమాణస్వీకారం చేస్తున్నారో తెలుసా?
గులాబీ దళపతి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు చేసారు.తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పండితులతో చర్చల అనంతరం…. గురువారం ఉదయం సుబ్రమణ్య షష్ఠి మంచి ముహూర్తమేనని అనడంతో రేపు మధ్యాహ్నం 1.30కు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ …
Read More »