Home / SLIDER (page 195)

SLIDER

రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు ఎందుకుంటుంది..?

మనం ప్రయాణించే రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తును గమనించే ఉంటారు. రైళ్ల చివర ఈ గుర్తు ఎందుకు ఉంటుందో అనే విషయంపై రైల్వే శాఖ ఇటీవల వివరణ ఇచ్చింది. రైలు అన్ని బోగీలతో ప్రయాణించిందని.. మధ్యలో బోగీలు ఎక్కడా విడిపోలేదని అధికారులు నిర్ధారించుకునేందుకు వీలుగా ఈ గుర్తును చివరి బోగీకి పెడతారట.

Read More »

రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త

రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్లపై వడ్డీరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాదికి 8.5% వడ్డీ రేటుతో గృహరుణాలు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. MSME రుణాలు కూడా 8.4% వడ్డీకే ఇస్తామని పేర్కొంది. మార్చి 31 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని BOB వివరించింది.

Read More »

కోవిడ్ వల్ల అంత ముప్పు ఉందా..?

ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే దాని ప్రభావం ప్రజలను వేధిస్తోంది. దీర్ఘకాల కోవిడ్ తో బాధపడుతున్న 59 శాతం మందిలో శరీరంలోని ఏదోఒక అవయవం దెబ్బతింటోందని బ్రిటన్ సైంటిస్టులు అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకినప్పటికీ ఇబ్బందులు పడనివారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం

దేశ రాజధాని మహానగరం  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.

Read More »

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ను బెదిరించిన వ్యవహారంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. తనను చంపుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 506 సెక్షన్ కింద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు …

Read More »

సునీల్ గవాస్కర్ రికార్డుకు నేటికి 36 ఏళ్లు

టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్.. టెస్టుల్లో 10వేల పరుగులు చేసి నేటికి 36 ఏళ్లు పూర్తవుతుంది. సరిగ్గా ఇదేరోజు 1987లో గవాస్కర్ 1030 టెస్ట్ పరుగులు చేసి.. ఇండియా తరపున ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ గా రికార్డు సృష్టించారు. ఆరోజున గవాస్కర్ సాధించిన రికార్డును ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటూ.. 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయేలా చేశారు. ఈక్రమంలో ఫ్యాన్స్ ఇది గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Read More »

మళ్లీ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మదు మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా తాజాగా మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడనున్నారు. ఢిల్లీలో ఈనెల 15-16 తేదీల్లో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో వధూవరులు ఉన్నట్లు వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు.

Read More »

నటిని చితకబాదిన బాయ్ ఫ్రెండ్

తన బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలకు గురిచేశాడని తమిళ నటి అనిఖా విక్రమన్ వెల్లడించారు. శరీరమంతా గాయాలు ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను గతంలో అనూప్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. అతడు నన్ను దారుణంగా హింసించాడు. మొదటిసారి కొట్టినప్పుడు కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో వదిలేశా. మళ్లీ అదే సీన్ రిపీటయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారికి డబ్బులిచ్చి అతను మేనేజ్ చేశాడు’ అని …

Read More »

మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా

మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.  తాజాగా 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో NPP 26 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు కావాల్సి ఉండగా, బీజేపీ (2)తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు.

Read More »

లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా

ఏపీలో పీలేరు నియోజకవర్గంలో  మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. నారా లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా రాధా జనసేనలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధా టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat