ఏపీలో పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు.
నారా లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా రాధా జనసేనలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధా టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.