దస్తురబాద్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్భంగా దేవునిగుడెం లో 20 లక్షల రూపాయలతో నిర్మించే గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ చేశారు.అనంతరం ఆకొండపెట్ లో చెరువు మత్తడి మరమ్మత్తు పనులను ప్రారంభించి మున్యల్ లో మనా ఊరు మన బడి పథకం ద్వారా మంజూరైన ప్రభుత్వ పాటశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ …
Read More »ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా …
Read More »‘ఓరి దేవుడా’.. ఈరోజే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎందులో అంటే!
సినీప్రియులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. మరికొన్ని గంటల్లో ఓరి దేవుడా సినిమా ఆహాలో అలరించనుంది. ఈరోజు (గురువారం) అర్ధరాత్రి 12 నుంచి ఓరి దేవుడా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా అభిమానులతో పంచుకుంది. ఆహా ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కు సినీప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫాంటసీ రొమాంటిక్ కామెడీగా …
Read More »కూతురు పెళ్లికి గవర్నర్‌ను ఆహ్వానించిన అలీ
ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన పెద్ద కూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా గవర్నర్‌కు అలీ శుభలేఖ ఇచ్చి తప్పకుండా పెళ్లికి రావాలని ఆహ్వానించారు. పెళ్లిపత్రికను అందుకున్న గవర్నర్ అలీకి శుభాకాంక్షలు తెలిపి పెళ్లికి కచ్చితంగా హాజరవుతానని చెప్పారు. ఇక ఈ మధ్యే అలీ కూతురు ఫాతిమా ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. మరోవైపు అలీ …
Read More »వావ్ నిత్యా.. ఎంత క్యూట్‌గా ఉందో!
జుట్టు ఊడిపోతోందని యువకుడి సూసైడ్!
కేరళలోని ఉత్తర్ కన్నూర్‌లో దారుణం జరిగింది. జుట్టు ఊడిపోతోందని మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఓ క్లినిక్‌లో మందులు వాడడంతో కనుబొమ్మలపైనా ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోవడంతో యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయమై మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర కన్నూర్‌కు చెందిన 26 …
Read More »మద్యం మత్తులో బతికున్న తల్లిని పూడ్చేసిన కొడుకు!
తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని సిత్తామూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫుల్లుగా తాగేసిన ఓ కొడుకు మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేసి అనంతరం ఆమెను బతికుండగానే గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. సిత్తామూర్‌కు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కూతురులు, ఒక కొడుకు. శక్తివేల్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మరోసారి వారి మధ్య గొడవ జరగడంతో శక్తివేల్ భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో …
Read More »నెక్ట్స్ మూవీలో అన్న సిక్స్ ప్యాక్ పక్కా.. సూపర్‌స్టార్ ఫోటో వైరల్!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు జిమ్‌లో వర్కౌట్ చేస్తోన్న ఫోటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోని చూస్తోన్న ఎంబీ ఫ్యాన్స్ ఈ రేంజ్‌లో కసరత్తులు చేస్తున్నాడంటే నెక్ట్స్ మూవీలో మా అన్న సిక్స్ ప్యాక్‌లో కనిపించడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ బాబు ట్రైనర్ సమక్షంలో డంబెల్‌తో కసరత్తు చేస్తున్నారు. దీన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన అభిమానులు అన్నా అన్ ఫైర్, నెక్ట్స్ సినిమాలో అన్న …
Read More »లెహంగా చిచ్చు.. ఏకంగా పెళ్లే క్యాన్సిల్!
అత్తింటివారు పెళ్లి కోసం పంపిన లెహంగా నచ్చలేదని ఓ వధువు ఏకంగా పెళ్లికే నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. సమయానికి పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. హల్ద్వానీకి చెందిన ఓ యువతికి, అల్మోరాలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో పెద్దలు వవాహం నిశ్చయించారు. నవంబరు 5న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇరు …
Read More »అయోధ్య చారిత్రాత్మక తీర్పునకు మూడేళ్లు.. వచ్చే ఏడాదికి రామమందిరం పూర్తి
ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడి నేటికి మూడేళ్లు పూర్తయింది. ఆయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేస్తూ అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. అనంతరం సుప్రీం కోర్టు ఆ స్థలం మొత్తం హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చింది. ఆ వివాదాస్పద భూమిలో శ్రీరాముడి ఆలయం నిర్మించే బాధ్యతను ట్రస్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. …
Read More »