సాయి రాజేష్ కు మారుతీ అదిరిపోయే గిఫ్ట్
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే యూనిక్ దర్శకులలో ఒకడు సాయి రాజేష్ .. ప్రస్తుతమున్న తెలుగు సినిమాలకు .. రొటీన్‌కు భిన్నంగా సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఒకవైపు మెగాఫోన్ పట్టుకుని సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగా మంచి మంచి కథాంశాలతో సరికొత్త సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో మెరుపువేగంతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే సాయి రాజేష్ నిర్మించిన ‘కలర్ ఫోటో’ సినిమాకు ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది. …
Read More »ధోనీ నిర్మాతగా మహేష్ బాబు సినిమా
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా అవతారమెత్తిన సంగతి విదితమే. మహీ నిర్మాతగా ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఇప్పటికే ‘రోర్ ఆఫ్ లయన్’, ‘బ్లేజ్ టు గ్లోరీ’, ‘ద హిడెన్ హిందూ’ అనే మూడు లఘు చిత్రాలను రూపొందించారు. అయితే తాజాగా దక్షిణాది తారలతో సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇకపై భారీ స్థాయిలో సౌత్ స్టార్స్‌తో సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ధోనీ. ఇందులో భాగంగా …
Read More »తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలమయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎస్ సోమేశ్ కుమార్‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో.. రేపట్నుంచి విధులకు హాజరవుతాయని పేర్కొన్నారు. మునుగోడు ఉప …
Read More »తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి.. ముఖానికి కవర్ చుట్టి.. నడిరోడ్డుపై!
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి, ముఖానికి ప్లాస్టిక్ కవరు చుట్టి నడిరోడ్డు మీద చంపేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ హత్య విషయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఐడీఏ బొల్లారం శివారులోని రింగురోడ్డు సర్వీసు రోడ్డుపై గురువారం తెల్లవారు జామున ఈ హత్య …
Read More »నేడే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి సీపీఎం, సీపీఐ పార్టీలు మద్ధతు తెలిపాయి. ఈ క్రమంలో ఈ రోజు గురువారం మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా చండూరు మండలంలోని …
Read More »కోడలు జీతం ఇవ్వడం లేదని అత్త ఆత్మహత్య!
తన కోడలు జీతం తనకి ఇవ్వకుండా పుట్టింట్లో ఇస్తోందని అత్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో జరిగింది. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలోని ముస్తఫా ప్లాజాలో 48 ఏళ్ల మెరాజ్ సుల్తాన్ ఉంటోంది. ఈమె భర్త ముఖ్దూం అహ్మద్ 8 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఫర్హానా నాజ్, కొడుకు ముజఫర్. కూతురుకి పెళ్లి చేయగా ఆమెరికాలో సెటిలయ్యారు. ఇక …
Read More »స్పైస్‌జెట్‌లో పొగలు.. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మార్గమధ్యంలో విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లో మొత్తం 86 మంది ప్యాసింజర్స్ ఉన్నారు.
Read More »అందుకే గాడ్‌ఫాదర్ కోసం సల్మాన్ రెమ్మునరేషన్ తీసుకోలేదట..!
మోహన్‌రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ గాడ్‌ఫాదర్. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ యూట్యూబర్‌గా కీలక పాత్రలో నటించారు. ఇక పూరీ మెగాస్టార్‌తో ఇన్‌స్టా వేదికగా కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో మూవీకి సంబంధించి పలు ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు చిరు. గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ రెమ్మునరేషన్ తీసుకోలేదని …
Read More »బస్టాండ్‌లో విద్యార్థుల పెళ్లి.. ఫ్రెండ్స్ ఆశీర్వాదం!
తమిళనాడులోని కడలూరి జిల్లా చిదంబరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న బస్టాండ్‌లో ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకున్నారు. పాలిటెక్నిక్ చదువుతున్న అబ్బాయి స్కూల్ విద్యార్థినికి తాళి కట్టాడు. చుట్టుపక్కల ఉన్న ఇతర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన చిదంబరం పోలీసులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. …
Read More »