దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,408 కరోనా పాజిటీవ్ మహమ్మారి కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,40,00,138కి చేరాయి. ఇందులో 4,33,30,442 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,312 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,43,384 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 54 మంది మరణించగా, 20,958 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »ఏపీలో మంకీ పాక్స్ కలవరం
ఏపీలో మంకీ పాక్స్ కలవరం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మంకీపాక్స్ ఒకటి అనుమానిత కేసు నమోదయ్యింది. ఒడిశా నుండి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా …
Read More »బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్.. అభిమాని అనుమానాస్పద మృతి
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా రూపొందించిన మూవీ బింబిసార. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు నందమూరి అభిమానులు భారీగా హాజరయ్యారు. అనంతరం ఓ అభిమాని అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మృతిచెందిన అభిమానిని తాడేపల్లి గూడెంకు చెందిన పుట్టా సాయిరామ్‌గా గుర్తించారు. కూకట్‌పల్లిలో ఉంటూ ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్న సాయిరామ్.. బింబిసార ప్రీరిలీజ్ ఫంక్షన్ నుంచి వచ్చే క్రమంలో …
Read More »టాలీవుడ్ స్టార్ హీరో ఊరమాస్ లుక్.. ఎవరో గుర్తుపట్టారా?
ఊరమాస్ లుక్‌తో ఉన్న ఈ టాలీవుడ్ స్టార్‌హీరో ఎవరో గుర్తుపట్టారా? ఎవరో కాదండీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఒక్కసారి ఆయన తన లుక్ మార్చేశారు. ఏ సినిమాకో న్యూ గెటప్ అనుకోకండి.. ఆ లుక్ ఓ యాడ్ షూట్ కోసం. దర్శకుడు హరీశ్‌శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓ యాడ్ షూట్‌లో అల్లు అర్జున్ రఫ్ లుక్‌తో కనిపించారు. బ్రౌన్, వైట్ కలర్ హెయిర్, చెవి పోగులు, స్టైలిష్ కళ్లద్దాలతో …
Read More »ఏపీ.. గోదావరిలో వనదుర్గ ఆలయం కొట్టుకుపోయింది!
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం ఇంకా అధికంగానే ఉంది. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒడ్డు కోతకు గురై ఓ ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని గోదావరి ఒడ్డున ఉన్న వనదుర్గ ఆలయం ఓ పక్కకి ఒరిగిపోవడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీంతో భయాందోళలకు గురై ఆలయ పరిసరాల్లోకి వెళ్లడం మానేశౄరు. సాయంత్రానికి ఆలయం మరింత కుంగి.. …
Read More »జయశంకర్ వర్సిటీలో ర్యాగింగ్.. 20 మందిపై కఠిన చర్యలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫస్టియర్ స్టూడెంట్స్‌ను సుమారు 20 మంది సీనియర్ల ర్యాగింగ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం క్రితం జూనియర్ల హాస్టల్‌లోకి వెళ్లి వారి డ్రెస్సులు విప్పించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం తాగాలని ఒత్తిడి చేయడం, సీనియర్ల హోంవర్క్ చేయిండం లాంటివి చేశారు. దీంతో ఓ విద్యార్థి ఈనెల 25న ఢిల్లీలోని యాంటీ …
Read More »‘అక్కడ జరగని పాపం లేదు.. అన్యాయాలను ఊహించలేము’
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అశ్వినీదత్. సీతారామం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని అశ్వినీదత్ విమర్శంచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆమధ్య …
Read More »మల్కాజిగిరిలో వ్యభిచారం -సడెన్ గా పోలీసులు ఎంట్రీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి శారదానగర్ కాలనీ ఫేజ్-3లో వరదవాణి(60) నివాసముంటోంది. ఓ మహిళ (36) వరదవాణికి పరిచయం అయ్యింది. తాను వ్యభిచారం చేస్తానని, వచ్చిన డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది. గురువారం రాత్రి వరదవాణి ఇంట్లో ఆమె వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు భగవాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1500 నగదును, 3 …
Read More »బాలయ్య మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ నటించనున్న మూవీలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు డైరెక్టర్ కథ వినిపిస్తాడని సమాచారం. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో 50 ఏళ్ల వయసున్న …
Read More »గ్యాంగ్ స్టర్ కథతో సూర్య మరో మూవీ
ప్రముఖ దర్శకురాలైన సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య మరో మూవీ చేయనున్నాడు. గ్యాంగ్ స్టర్ కథతో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మూవీ ఉంటుందని సుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఆకాశం నీహద్దురా మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం బాల డైరెక్షన్లో సూర్య చేస్తున్న వణంగాల్(తెలుగులో అచలుడు) పూర్తయ్యాక కొత్త మూవీ …
Read More »