ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగు చూసింది. ఘనా దేశంలో మార్బర్గ్ వైరస్‌ను కనుగొన్నారు. ఇటీవల రెండు కేసులు నమోదు కాగా తాజాగా ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వారితో సన్నిహితంగా మెలిగిన 34 మందిని గుర్తించినట్లు వెల్లడించింది. ఆస్పత్రిలో చనిపోయిన ఇద్దరు బాధితుల్లోనూ డయేరియా, జ్వరం, వికారం, వాంతుల వంటి లక్షణాలు కనిపించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో …
Read More »అమర్‌నాథ్ యాత్రలో వరద బీభత్సం.. పదిమంది మృతి
జమ్ముకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రలో వరద బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండలపై నుంచి వరద నీరు పోటెత్తడంతో అక్కడ ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మంది యాత్రికులు మృతి చెందగా, పలువురు గల్లంతైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మిగతావారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా కుంభవృష్టి వర్షం కురవడంతో మృతుల …
Read More »హైదరాబాద్‌లో మూడు రోజులు అతి భారీ వర్షాలు
హైదరాబాద్ నగరవాసులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచే వర్షం పడుతోంది. నగరంతో పాటు తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు …
Read More »‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నటుల లుక్స్ అదుర్స్
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ, హిందీ, భాషల్లో విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో నటుల లుక్స్ సామాజిక మాధ్యమంలో పంచుకొగా అవి వైరల్ అవుతున్నాయి.
Read More »గుడ్ న్యూస్: రేట్ తగ్గిన వంట నూనె.. అమల్లోకి ఎప్పుడంటే!
సామాన్యులకు కేంద్రం తీపికబురు చెప్పింది. వంట నూనె రేటును లీటరుకు రూ.15 తగ్గించింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తగ్గిన ధరల ప్రయోజనాన్ని వెంటనే ప్రజలకు అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్రం ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం మేరకు పామాయిల్, సోయాబీన్, రైస్ బ్రాన్ ఆయిల్ రేట్లను 5 నుంచి 11 శాతం తగ్గించింది.
Read More »చైతూతో లావణ్య నటించకపోవడానికి కారణం అదే..!
నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో ఎందుకు నటించలేదో చెప్పారు. హ్యాపీ బర్త్‌డే సినిమా ప్రమోషన్ష్‌లో భాగంగా ఓ ఇంటర్వూలో చైతూ సరసన ఎందుకు నటించలేదని ఓ విలేకర్ అడగగా.. చైతన్య పక్కన నేనెందుకు ఆ రోల్ చేస్తా అని అన్నారు లావణ్య. సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున, లావణ్య జంటగా నటించారు. …
Read More »హీరో విక్రమ్ తాజా ఆరోగ్య పరిస్థితి ఇదే..
ప్రముఖ తమిళ హీరో విక్రమ్‌కు చాతి నొప్పి రావడంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. త్వరలో డిశ్చార్చి చేయనున్నట్లు చెప్పారు.
Read More »హైదరాబాద్ లో దారుణం.. ఓ యువతిని ప్రేమించి… మరో యువతిని…?
తనను మోసం చేసిన వ్యక్తిపై బాధిత యువతి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షీ టీం పోలీసుల వివరాల ప్రకారం..నగరంలోని మాదాపూర్ లో ఆపరేటర్ గా పని చేస్తున్న అఖిల్ ఓ యువతిని ప్రేమించాడు.. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. తనను మోసం చేశాడని బాధిత యువతి షీటీంకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజమని తేలింది.. …
Read More »ఆ 4గురికి రాజ్యసభ
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో కేంద్రం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కథా రచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పి.టి.ఉష ఉన్నారు. వీరితోపాటు ప్రముఖ సామాజిక వేత్త వీరేంద్ర హెర్డే కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ వరుస …
Read More »మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం
మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేతో కలిసిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలోనూ మహారాష్ట్రలో ఉన్నట్లే బుజ్జగింపు రాజకీయాలున్నాయని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు అన్నారు.
Read More »