ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఎన్టీఆర్ అభిమాని జనార్దన్ మృతిచెందాడు. రోడ్డు ప్రమాదానికి గురై గతకొంతకాలంగా కోమాలో ఉన్న అతడు ఈరోజు చనిపోయాడు. ఇటీవల తన అభిమానులతో విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ జనార్దన్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. దేవుడిని నమ్మాలని భరోసా ఇచ్చాడు.అంతేకాకుండా జనార్దన్ చెవి దగ్గర ఫోన్ పెట్టడంతో అతడితో ఎన్టీఆర్‌మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ విధికి కనికరం పుట్టలేదు. జనార్దన్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఈరోజు …
Read More »తడి చెత్తతో రూ.6లక్షల ఆదాయం: కేటీఆర్ అభినందన
పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …
Read More »జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు: కేసీఆర్ ఆదేశం
రాష్ట్రంలోని భూముల సమస్య పరిష్కారానికి జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి మూడురోజులకు ఒక మండల కేంద్రం చొప్పున 100 టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదస్సుల్లో జేసీ, డీఆర్వో, ఆర్డీవో, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనాలని ఆదేశించారు. మరోవైపు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అవగాహన సదస్సును ఈనెల 11న నిర్వహించనున్నారు. …
Read More »హైదరాబాద్‌లో ఎంపీ రఘురామపై కేసు నమోదు
ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసునమోదైంది. రఘురామ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభానిపై ఎంపీ సిబ్బంది దాడి చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్, కానిస్టేబుల్ సందీప్, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ, పీఏ శాస్త్రిలను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More »TTD చరిత్రలోనే అత్యధిక ఆదాయం
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారికి ఆదివారం ఒకే రోజు రూ.6కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇంతకు ముందు వెంకన్నకు ఒకే రోజు రూ.5.73కోట్లు కాగా.. 2012 ఏప్రిల్ ఒకటిన ఆదాయం లభించింది. తాజాగా ఆదివారం ఒకే రోజు రూ.6.18కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది.ఈ మేరకు తిరుమల …
Read More »తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ నేత.. ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ మళ్లీ తెలంగాణలో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా వచ్చే సెప్టెంబర్ లో మరోసారి రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్ల కు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక …
Read More »శ్రీరామ్ నగర్ కాలనీ వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది-MLA Kp
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కి చెందిన కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీ ప్రైవేట్ భూముల్లో డిఫెన్స్ జోక్యంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నోటీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి …
Read More »ఈ నెల 31 తేదీ వరకు 362.88 కోట్ల ఉపకార వేతనాలు విడుదల
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగుల, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన 362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటు మార్చి 31 …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య నిన్న సోమవారం కాస్త తగ్గింది. గడిచిన గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 13,086 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. నిన్న 16వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి. తాజాగా 12,456 మంది బాధితులు కోలుకోగా.. మరో 24 మంది …
Read More »ఆర్ నారాయణ మూర్తి ఇంట్లో విషాదం
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుమకున్నది. ప్రముఖ సినీనటుడు, పీపుల్స్ స్టార్, దర్శక నిర్మాత అయిన ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. ఏపీలోని కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు సంతానం .. వారిలో మూడో కుమారుడు ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి తల్లి చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read More »