తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ ఎక్కడ ఉంది? అని కేటీఆర్ ప్రశ్నించారు.ఈ రెండు తెలంగాణలోనే ఉండటం, వీటిని కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించడం గర్వకారణంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వరకు అన్ని …
Read More »తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ రోజు గురువారం ఉదయం పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల …
Read More »Telangana SSC Results-సత్తా చాటిన గురుకులాల విద్యార్థులు
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గురుకులకు చెందిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రయివేటు స్కూళ్లను దాటేసి విజయఢంకా మోగించారు. మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ గురుకుల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి మొదటి వరుసలో నిలిచారు. ఇవాళ విడుదలైన టెన్త్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు అత్యధికంగా 99.32 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు …
Read More »జులై 2న హైదరాబాద్‌కు రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కి ఘనస్వాగతం
జులై 2వ తేదీన హైదరాబాద్‌కు రానున్నరు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ యశ్వంత్ సిన్హా.ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, ఆయనకు మద్ధతుగా నిర్వహించే సభపై హైదరాబాద్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ .యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలకాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ …
Read More »వైసీపీ ప్లీనరీలో విజయమ్మ పాల్గొంటారు: విజయసాయిరెడ్డి
గుంటూరు జిల్లాలో త్వరలో నిర్వహించే వైసీపీ ప్లీనరీ ఏపీ రాజకీయ చిత్రపటంపై తనదైన ముద్ర వేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వచ్చేనెల 8, 9 తేదీల్లో ప్లీనరీ జరగనుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు ఇతర పార్టీల కంటే …
Read More »రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు: నిరంజన్‌రెడ్డి
అర్హులైన లబ్ధిదారులందరికీ ‘రైతుబంధు’ కింద ఆర్థికసాయం జమ చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. ఎక్కువ భూమి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందనేది అవాస్తమని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. రైతుబంధుపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదో విడత రైతుబంధు కింద రూ.7,508కోట్లు అందిస్తున్నామని మంత్రి …
Read More »ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపండి: కొడాలి నాని
వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని.. అంతే తప్ప మామ, అల్లుళ్లు కాదని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కొడుకు కృష్ణమూర్తి నిలబడినా ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని ఇల్లరికం అల్లుడిని కాదనంటూ పరోక్షంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఉద్దేశించి …
Read More »సికింద్రాబాద్‌లో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ పేరుతో భారీ ఫ్లెక్సీ
ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ చేసిందేమీ లేదంటూ సికింద్రాబాద్‌లో భారీ ఫ్లెక్సీ వెలిసింది. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ బహిరంగసభ జరగనుంది. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు. అయితే మోదీ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదంటూ టివోలీ థియేటర్ సిగ్నల్ సమీపంలో ఎవరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నోట్ల రద్దు, ప్రభుత్వసంస్థల అమ్మకం, అగ్నిపథ్, రైతు …
Read More »హేమచంద్ర, శ్రావణ భార్గవి డైవర్స్?..క్లారిటీ ఇచ్చిన సింగర్స్
తెలుగు సినిమా రంగంలో హేమచంద్ర, శ్రావణ భార్గవి జంట మంచి గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్న ఈ జంట.. 2009లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే ఈ మధ్య హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ స్పందించారు. ఇన్‌స్టాలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవాలేనని …
Read More »వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ అధికార వైసీపీకి చెందిన శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శ్రీశైలంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల మహిళలే తమకు ఓటు వేస్తారని అన్నారు. ‘మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు’ అని వ్యాఖ్యానించారు. సోషల్ …
Read More »