మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్‌కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్‌ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్‌కి థాంక్స్ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్‌మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …
Read More »కొవ్వు తీయించుకోవాలని చేసిన సర్జరీ ఫెయిల్.. హీరోయిన్ మృతి
మరింత అందంగా కనిపించాలని ప్రయత్నించిన ఓ యంగ్ హీరోయిన్ జీవితం అనూహ్యంగా ముగిసిపోయింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కొవ్వు తీయించుకునేందుకు జరిగిన సర్జరీ ఫెయిల్ కావడంతో 21 ఏళ్ల కన్నడ నటి చేతనరాజ్ మృతిచెందింది. సర్జరీ తర్వాత అనారోగ్య సమస్యలు రావడంతోనే తమ కుమార్తె చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్ అనంతరం చేతనకు లంగ్స్‌లో వాటర్ చేరడంతో హార్ట్ ఎటాక్ వచ్చి చేతన మృతిచెందినట్లు తెలుస్తోంది. వైద్యుల …
Read More »హైదరాబాద్‌లో ఈనెల 19న ఆటోలు, క్యాబ్‌లు బంద్!
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను 714 తీసుకొచ్చి ఫిట్‌నెస్ రెన్యువల్ రోజుకు రూ.50 పెనాల్టీ …
Read More »వైసీపీ రాజ్యసభ టికెట్లు ఫైనల్.. అభ్యర్థులు వీళ్లే..
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం కల్పించారు. అనూహ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను వైసీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్‌రెడ్డికి ఆ పార్టీకి అధినేత, సీఎం జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం …
Read More »ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు, రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీటి సరఫరా, గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, …
Read More »TRSలో చేరిన BJP నేతలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ …
Read More »సీసీఐ పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకోండి-కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు
Read More »పిల్లలకు మంచి ఆరోగ్యానివ్వాలి-మంత్రి హరీశ్‌రావు
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ 9వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను వైద్యారోగ్యశాఖ మంత్రి తాజ్ డెక్కన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ఐ ఇచ్చిన సర్వే …
Read More »మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో CBI సోదాలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదరంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, కర్నాటక, ఒడిశా తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు …
Read More »దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది. తాజాగా వైరస్‌తో 19 మంది మృతి చెందగా.. 24 గంటల్లో 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. ఇందులో 4,25,84,710 మంది కోలుకున్నారు. మహమ్మారి …
Read More »