సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రకు మీనాక్షి చౌదరి ఎంపికైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజ రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఖిలాడి’ మూవీలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే మహేశ్, త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ అందుకుందట. పూజ హెగ్డే ఇందులో మెయిన్ హీరోయిన్. మహేశ్ బాబు …
Read More »సైబర్ నేరాల నిరోధానికి పటిష్ఠ చట్టం
సైబర్ నేరాల నిరోధా నికి పటిష్ఠ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్సార్ యూనివర్సిటీతో కలిసి ముసాయిదా రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యురిటీ సేవల సంస్థ ఇవాంటి హైదరాబాద్‌లో గురువారం తమ సేవలను ప్రారంభించింది. బంజారాహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి సైబర్ సెక్యూరిటీ …
Read More »టీఆర్‌ఎస్ ప్లీనరీలో రుచికరమైన వంటకాలు
టీఆర్‌ఎస్ ప్లీనరీ అంటే రాజకీయ తీర్మానాలే కాదు రుచికరమైన వంటకాలకూ ప్రసిద్ధి. ఈ సారి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు 29 రకాల వంటలకు సంబంధించి మెనూ ఫైనల్ చేశారు. పార్టీ ప్రతినిధులతో పాటు, పోలీసులు, గన్‌మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు ఇలా 15 వేల మందికి సరిపడా వంటలు సిద్ధం …
Read More »బ్రిటన్‌లో మళ్లీ కరోనా దూకుడు
బ్రిటన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గత ఎనిమిది రోజులుగా 40 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 52 వేలు దాటింది. యూకేలో గురువారం కొత్తగా 52,009 మంది కరోనా బారినపడ్డారు. మరో 115 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సఖ్య 86,41,221కి చేరగా, 1,39,146 మంది మృతిచెందారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయని, పరిస్థితిని నిషితంగా గమనిస్తున్నామని బ్రిటన్ …
Read More »గెల్లుకు హుజురాబాద్ ప్రజలు బ్రహ్మరథం
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆర్థికమంత్రి హరీశ్‌రావుతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో గెల్లుకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్లతో గెల్లుకు స్వాగతం పలికారు. హరీశ్‌రావుతో పాటు పార్టీ నాయకుల మీద పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ అంకుషాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ …
Read More »గెల్లు గెలుపుకోసం ఏకంగా భద్రాచలం నుండి
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీమీద ఉన్న అభిమానం అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారానికి ప్రకాశ్‌ను భద్రాచలం నుంచి హుజూరాబాద్‌కు నడిపించింది. సైకిల్ కు జెండాలు కట్టుకుని హూజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామగ్రామాన తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అలా అని ఆయన పార్టీలో లీడరేం కాదు సామాన్య కార్యకర్త. ఏమి ఆశించకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడంటే ప్రకాశ్ కు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న అభిమానం వెలకట్టలేనిది. ప్రకాశ్‌ను …
Read More »ఈటలరాజేందర్ కు ఓటమి భయం
ఈటలరాజేందర్ కు ఓటమి భయం పట్టుకుంది. ఓడిపోతాననే ఫస్ట్రేషన్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడు తున్నడు. అరేయ్.. ఓరేయ్ అంటున్నడు. కూలగొడత, కాలబెడతా అంటున్నాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం వావిలాలలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో ఈటల విపరీత వాఖ్యలు చేస్తున్నారని, ఫస్ట్రేషన్ లో నోరు జారి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు ఏడేండ్లలో కేంద్రంలో …
Read More »ప్రజలంటే మోదీకి ఇంత ఈసడింపా?-వ్యాసకర్త: శ్రీ చంటి క్రాంతికిరణ్( అందోల్ ఎమ్మెల్యే)
ఈటలకు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్‌కు లేదా బీజేపీ జాతీయ పార్టీ కనుక తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేందర్‌కు వేసినా, బీజేపీకి వేసినా.. ప్రజలకు కీడు చేస్తున్నవారిని ఏరికోరి మరీ నెత్తిన పెట్టుకున్నట్లు కాదా..! కొందరు వీరావేశంతో బీజేపీని, మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దేశంలో ఏవో అద్భుతాలు చేశారని, భవిష్యత్తులో చేయబోతున్నారని అంటున్నారు. వాస్తవానికి మోదీ …
Read More »దళిత బంధు పై బీజేపీ కుట్ర – ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి తీసుకొచ్చిన పథకం దళిత బంధు పథకాన్ని బీజేపీ కుట్రలు చేసి ఆపిందని అన్నారు జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు బుధవారం జమ్మికుంట మండలంలోని మాచనపల్లి మరియు నాగంపేట దళిత కాలనిలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య మరియు గాదరి కిషోర్ తో కలిసి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడ్తు తెలంగాణ రాష్ట్ర …
Read More »నా పోకస్ దానిపైనే – కీర్తి సురేష్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇకపై తన ఫోకస్ మొత్తం పక్కా కమర్షియల్ సినిమాల మీదే పెట్టాలనుకుంటోందట. టాలీవుడ్‌లో ఆమెకు ‘మహానటి’ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్ అసాధారణం. దాంతో ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మీద ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’ చిత్రాలను చేశారు. అయితే గత ఏడాది విడుదలైన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు కీర్తిని తీవ్రంగా …
Read More »