సైబర్ నేరాల నిరోధా నికి పటిష్ఠ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్సార్ యూనివర్సిటీతో కలిసి ముసాయిదా రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యురిటీ సేవల సంస్థ ఇవాంటి హైదరాబాద్‌లో గురువారం తమ సేవలను ప్రారంభించింది.
బంజారాహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి సైబర్ సెక్యూరిటీ పాలసీని తెచ్చింది.
ఇప్పుడు సైబర్ క్రైం చట్టంతో మరోసారి దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నదని చెప్పారు. టెక్నాలజీ వినియోగం వల్ల అనేక ప్రయోజనాలున్నప్పటికీ సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వాలు, సంస్థలు, పరిశ్రమలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.