Home / SLIDER / గెల్లు గెలుపుకోసం ఏకంగా భద్రాచలం నుండి

గెల్లు గెలుపుకోసం ఏకంగా భద్రాచలం నుండి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీమీద ఉన్న అభిమానం అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారానికి  ప్ర‌కాశ్‌ను భ‌ద్రాచ‌లం నుంచి హుజూరాబాద్‌కు న‌డిపించింది. సైకిల్ కు జెండాలు కట్టుకుని హూజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామ‌గ్రామాన తిరుగుతూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాడు.

అలా అని ఆయ‌న పార్టీలో లీడ‌రేం కాదు సామాన్య కార్య‌క‌ర్త‌. ఏమి ఆశించ‌కుండా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాడంటే ప్ర‌కాశ్ కు టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ల ఉన్న అభిమానం వెల‌క‌ట్ట‌లేనిది. ప్ర‌కాశ్‌ను గురువారం మంత్రి హ‌రీశ్‌రావు అభినందించారు.

జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న‌ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ రావు తిరిగి వెళ్లున్న క్రమంలో టీఆర్‌ఎస్ జెండాలతో వెళ్తున్న‌ సైకిల్‌ కనిపించింది. వెంటనే వాహనాన్ని ఆపి సైకిల్‌పై వెళ్లున్న వ్యక్తిని పలుకరించాడు, త‌న పేరు ప్ర‌కాశ్ అని త‌న‌ది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పాడు.

టీఆర్‌ఎస్ పార్టీపై ఉన్న అభిమానంతో ఇక్కడ ఉప ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి తన సైకిల్ కు టీఆర్ఎస్ జెండాలు క‌ట్టుకుని, మైకు అమ‌ర్చుకుని గ‌డ‌చిన ఆరు నెల‌లుగా ప్ర‌చారం చేస్తున్నాన‌ని చెప్ప‌డంతో హ‌రీశ్‌రావు ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.