అబద్ధాలు చెప్పి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రం జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మూడేళ్ల క్రితం పసుపు …
Read More »ఓరి దేవుడో.. పొట్టలో 108 హెరాయిన్ మాత్రలు.. విలువ తెలిస్తే షాక్ అవుతారు!
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఏకంగా తన పొట్టలో 108 హెరాయిన్ మాత్రలను దాచేశాడు. వివరాల్లోకి వెళితే.. గత నెల 26న టాంజానియా దేశస్థుడు జోహనెస్‌బర్గ్ నుంచి శంషాబాద్ వచ్చాడు. అతడి వ్యవహారశైలిపై డౌట్ రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లగేజీ తనిఖీ చేసి అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ లేనట్లు తేల్చారు. కానీ ఆ వ్యక్తి …
Read More »యాదాద్రిలో కారు పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కారు పార్కింగ్ ఫీజుపై అధికారులు సవరణ చేశారు. కొండపై వాహనాల పార్కింగ్ రూ.500 చొప్పున.. ఆపై ప్రతి గంటకు రూ.100 చొప్పున ఫీజు వసూలు చేస్తామని ఇటీవల ఆలయ ఈవో గీత ప్రకటించారు. అయితే ఆ నిబంధనలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గంటకు రూ.100 చొప్పున వసూలు చేయాబోమని.. ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో …
Read More »తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ళుగా పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ఆటలు ఇక రాష్ట్రంలోసాగనివ్వబోమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హెచ్చరించారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మళ్లీ సిరిసిల్లకు వెళ్తాను. వెళ్తే చంపుతారా.. అరెస్టు చేస్తారో చెప్పాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనపై డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్తే దాడి చేయించారని …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ మాట్లాడుతూ” పాలమూరు నుంచి వలసలు లేవని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. వలసలు ఉన్నాయని నిరూపించడానికి తాను సిద్ధమని చెప్పారు. దేవరకద్ర బహిరంగసభలో …
Read More »కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ దంపతులు
జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జిల్లాలోని ప్రముఖ ఆలయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు మందు ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం హరీశ్ రావు దంపతులకు అర్చకులు వేదాశీర్చనం అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు …
Read More »యాదాద్రి జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో యువతీ యువకుల డెడ్‌బాడీలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తుతెలియని యువతీ యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి డెడ్‌బాడీలను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. అవి కుళ్లిపోయిన స్థితితో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. పోలీసులు క్లూస్ టీమ్‌తో అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సమీపంలో దొరికిన బ్యాగ్‌లోని వివరాల ఆధారంగా మృతులను హైదరాబాద్ నగర …
Read More »హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్ పరిధిలోని ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైలు ఛార్జీలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 5 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఫలక్‌నుమా- సికింద్రాబాద్, హైదరాబాద్- లింగంపల్లి-రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ తగ్గింపు వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన …
Read More »తెలంగాణకు మూడురోజుల వర్షసూచన
ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు పడతాయని.. పలుచోట్ల ఈదరుగాలులు కూడా వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుందని.. మూడు డిగ్రీల వరకు పెరగొచ్చని …
Read More »అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మోకాలి చిప్పలు మార్పిడి చికిత్స
గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట దవాఖానలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి …
Read More »