కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ గ్రామంలోని లహరి గ్రీన్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యను పరిశీలించి, …
Read More »ఇరానీ చాయ్ ధర పెంపు…
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ తింటే బిర్యానీ తింటారు. లేదా ఇరానీ చాయ్ అయిన తాగుతారు. ఇద్దరు ముగ్గురు దోస్తులు కల్సి ముచ్చట్లు పెట్టాలన్నా కానీ ఇరానీ చాయ్ దుఖాణానికెళ్లి మరి చాయ్ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని ఇరానీ చాయ్ ధరను పెంచాలని హోటళ్ల బృందం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా …
Read More »BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ కు షాక్ -వెంటనే అరెస్ట్ కు కోర్టు ఆదేశం
ఎప్పుడు ఏదోక వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియా సమావేశం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఇది నిజంగా బిగ్ షాకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీకి చెందిన యువమంత్రి కేటీఆర్ గురించి దుర్భాషలాడిన కేసులో ఎంపీ ధర్మపురి అర్వింద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో …
Read More »పంజాబ్‌లాగే మా వడ్లు కూడా తీసుకోవాల్సిందే: నిరంజన్‌రెడ్డి
ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పామన్నారు. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల, టీఆర్‌ఎస్ ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చాలా హేళనగా మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలను ఆయన అవమానించారని ఆరోపించారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అనేది తమకు సంబంధం లేదని.. మిల్లర్లతో మాట్లాడుకుని కేంద్రమే పట్టించుకోవాలన్నారు. …
Read More »తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..
టీచర్ల నియామకానికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. టెట్ నిర్వహణకు ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్ 16 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్ 12న టెట్ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన …
Read More »తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఫిష్న్ కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు తో కంపెనీ అధికారులు భేటీ అయ్యారు. ఫిషొన్ పెట్టుబడితో సుమారు 5వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఫిషన్ ఎగుమతి చేస్తోంది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెడికల్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు కనోయాంట్ పేర్కొంది. మెడికల్ డివైస్ తయారీలో కన్హయాంట్ …
Read More »30,453 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కు ముహుర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా అధికార టీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు గాను నిన్న బుధవారం తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో TSPSC, TSLPRB, DSC లాంటి నియామక సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేసుకోవచ్చు. అయితే వచ్చే నెలలో రానున్న ఉగాది రోజు (ఏప్రిల్ 2) నోటిఫికేషన్లు వచ్చే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక టెట్ …
Read More »బీజేపీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు గురువారం సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వరంలో చేపట్టిన ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ…. …
Read More »తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది.శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు …
Read More »దేశమంతా ఒకే విధానం ఉండాలి: మోడీకి కేసీఆర్ లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై పలు విషయాలను సీఎం ప్రస్తావించారు. తెలంగాణలో యాసంగి సీజన్‌లో పండిన మొత్తం ధాన్యాన్ని సేకరించాలని.. అలా చేయకపోతే కనీస మద్దతు ధరకు అర్థం ఉండదని సీఎం పేర్కొన్నారు. దీంతో జాతీయ ఆహార భద్రత లక్ష్యానికి విఘాతం కలుగుతుందని చెప్పారు. ధాన్యం పూర్తిగా సేకరించకపోతే రాష్ట్ర రైతులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని …
Read More »