మార్చ్ 2..తెలంగాణలో మొదటి కరోనా వైరస్ కేసు బయటపడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ హెల్త్ అధికారులు పూర్తి విశ్లేషణ చేసి వివరాలు తెలుసుకున్నారు. మనకి వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఒక సాఫ్ట్ వేర్ కుర్రాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ఫిబ్రవరి 15న బెంగుళూరు నుండి దుబాయ్ వెళ్లి అక్కడ 19 తీదీ వరకు ఉన్నాడు. ఫిబ్రవరి 20న దుబాయ్ నుండి తిరిగి వచ్చేసాడు. అనంతరం …
Read More »నెక్లెస్ రోడ్డుపై మంత్రి హరీశ్ వాకింగ్
తెలంగాణలో సిద్దిపేట పట్టణంలోని సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ సివిల్ నిర్మాణ పనులన్నీ 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట మినీ ట్యాoకు బండ్-కోమటి చెరువు కట్టపై నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డుపై బుధవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులను కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, …
Read More »కేసీఆర్ మానస పుత్రికలే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ కరీంనగర్ శివారులో ఖాళీ స్థలాల్లో హరిత వనాలు ఏర్పాటు చేస్తామన్నారు. నగరాన్ని మొత్తం హరితహారంగా మార్చుతామని ఆయన అన్నారు. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి …
Read More »ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా ఏరియా ఆస్పత్రిలో రూ 38 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డయాగ్నస్టిక్ సెంటర్ భవనమునకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య వసేవలు అందించేందుకు వైద్య రంగానికి కోట్లాది రూపాయల …
Read More »పరిపాలనలో పారదర్శకత పెంచేందుకే కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఉద్యోగులు తమ విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర అటవీ పర్యావరణం న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ లతో కలిసి కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్ పనితీరుపై పరిశీలించారు. వీడియో కాలింగ్ ద్వారా లక్ష్మణ్చందా ఎంపీడీవో మోహన్ తో మాట్లాడి విధులలో భాగంగా …
Read More »దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్..!!
పోలీసు శాఖను బలోపేతం చేయడం వల్లనే… సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ సాధ్యమైందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతి భద్రతలను కాపాడినప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందని… అందుకే సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్… బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కంమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర జరుగుతున్న పనులను …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో వైసీపీ ఎమ్మెల్యే రజని
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా ఈరోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు జిల్లాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) మాట్లాడుతూ సహచర ఎమ్మెల్యే రోజా పర్యావరణ పరిరక్షణకు పెడుతున్న శ్రద్ద అద్భుతమైన కార్యాచరణ అని , అందులో నాకు అవకాశం ఇవ్వడం ఎంతో …
Read More »కరోనా వైరస్‌పై దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య శాఖ అధికారులతో …
Read More »కరోనాపై భయం అవసరం లేదు.. మంత్రి ఈటెల
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహామ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరికీ తెలంగాణలో కరోనా సోకలేదని.. విదేశాల నుంచి వచ్చేవారికే కరోనా ఉన్నట్టు తేలిందని చెప్పారు. కరోనా విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరంలేదన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పాటు… చెస్ట్, ఫీవర్ …
Read More »మే నెల నాటికి సస్పెన్షన్ బ్రిడ్జి పూర్తి కావాలి.. మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో పలు పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెం.45లో నిర్మిస్తున్న ఫ్లైవర్ పనులను పరిశీలించారు. అలాగే దుర్గం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మే నెల నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ‘తీగల వంతెన నిర్మాణం పూర్తైన తర్వాత సుందరీకరణ పనులు ప్రారంభించాలి. పనులు వేగవంతం …
Read More »