తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో ప్రో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు,తెలంగాణ సమాజానికి ఆయన జీవితం ఆదర్శం.. సార్ కలలు నెరవేర్చేదిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
Read More »గోదావరికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మేడిగడ్డకు చేరుకున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి వెంట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్,రాజ్యసభ జోగినపల్లి ఎంపీ సంతోష్‌కుమార్, సీఎంవో, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రికి మేడిగడ్డ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు పుట్టమధు, శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ ఘనంగా స్వాగతం పలికారు. …
Read More »ఆచార్య శ్రీ జయశంకర్ సారు యాదిలో…!
తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరిగిపోని శిలాక్షరం…ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం…తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత…ఆచార్య శ్రీ కొత్త పత్తి జయశంకర్ సార్ జయంతి నేడు. సమైక్యపాలనలో అన్ని విధాల దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రేకెత్తించిన ..ఆచార్య జయశంకర్ 1934, ఆగస్టు 6న అంటే సరిగ్గా ఇదే రోజున ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం …
Read More »మోజో టీవీ ఉద్యోగులకు సీఈవో రేవతి, ఫోర్జరీ ప్రకాష్‌ల మరో మోసం…ఇవిగో ఆధారాలు…!
ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్కైన టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్, మోజీ టీవీ సీఈవో రేవతిల మోసం బయటపడింది. టీవీ 9 నిధులను మోజో టీవీకి మళ్లించిన రవిప్రకాష్ అనధికారికంగా టీవీ 9 కు ప్రత్యామ్నాయంగా మోజీ టీవీని నడిపించిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు మోజో టీవీ సీఈవో రేవతి నానా రచ్చ చేసింది. జర్నలిస్టుల గొంతు నొక్కేస్తున్నారంటూ సన్నాయి నొక్కులు …
Read More »రేపు ధర్మపురికి సీఎం కేసీఆర్
మేడిగడ్డ నుండి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరి నది ని చూడడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, గోలివాడ పంప్ హౌజ్, ధర్మపురి పుణ్యక్షేత్రాలను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. అధికారులు ఇంజనీర్లతో పాటు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఈ పర్యటన ప్రారంభిస్తారు
Read More »తెలంగాణకి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలి..!!
గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రాహుల్ ప్రసాద్ భట్నాగర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ అందజేశారు. రాష్ర్టంలో అమలవుతున్న పథకాలను, కార్యక్రమాలను వివరించారు. …
Read More »చింతమడక ఆరోగ్య సూచిక.. దేశానికే ఆదర్శం కావాలి….!!
చింతమడక లో జరిగే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో చింతమడక లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సియం కేసీఆర్ గారు, యశోద ఆస్పత్రి …
Read More »దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!
పొద్దున లేస్తే మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్. ఇండియాలో 2016 నుంచి …
Read More »సీఎం కేసీఆర్ సరికొత్త నిర్ణయం
తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 60 రోజుల కార్యాచరణ అమలులో భాగంగానే పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు. గ్రామ వికాసంలో పంచాయతీ …
Read More »డబ్బా పాలు వద్దు -తల్లి పాలు ముద్దు… తల్లిపాల వారోత్సవాలలో…మంత్రి మల్లారెడ్డి…!
తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ ఆగస్టు 2 వ తేది నుండి తల్లి పాల వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 8:00 గంటలకు నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజా వద్ద ధాత్రి తల్లి పాల బ్యాంక్ మరియు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో వాక్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి …
Read More »