తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్, తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరాం తాజాగా చేసిన కామెంట్లు ఆశ్చర్యకర రీతిలో ఉన్నాయని చర్చ జరుగుతోంది. బిడ్డ పుట్టకముందే కుల్ల కుట్టిన చందంగా ఆయన సీఎం పీఠం గురించి కామెంట్లు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కీలక శక్తిగా ఎదగడం, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆ పార్టీ నాయకుడు కుమారస్వామి కైవసం చేసుకోవడం తెలిసిన సంగతే. అయితే ఇదే లెక్కతో …
Read More »రేవంత్ రెడ్డి పై మండిపడ్డ కోమటిరెడ్డి వెంకట రెడ్డి..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.తాజాగా కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు ఉన్న ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అభ్యర్తేనని, 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకే దిక్కులేదని ఈ సందర్భంగా అయన వాపోయారు. పాదయాత్రపై రేవంత్ …
Read More »పుట్టిన రోజు నాడే..కోమటిరెడ్డికి షాక్ ఇచ్చిన కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, నల్గొండ ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా అనూహ్యమైన షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్న కోమటిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై సదభిప్రాయం లేకపోవడం వల్లే సస్పెన్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మద్దతుగా నిలబడటం లేదనే భావన ఉంది. ఇదిలాఉండగా కోమటిరెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతి
కేంద్ర మాజీ మంత్రి, సికింద్రబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.అయన కుమారుడు వైష్ణవ్ రాత్రి(మంగళవారం,మే-23) గుండెపోటుతో చనిపోయారు.రాత్రి ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు వైష్ణవ్ ను ముషీరాబాద్ లోని గురునానక్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పన్నెండున్నరకు కన్నుమూశారు. వైష్ణవ్ కు 21 ఏళ్ల. వైష్ణవ్ ప్రస్తుతం MBBS మూడో ఏడాది చదువుతున్నారు. వైష్ణవ్ దత్తాత్రేయకు ఒక్కడే …
Read More »నిపా వైరస్.. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
కేరళను వణికిస్తున్న నిపా వైరస్ తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నిపా వైరస్ పై వైద్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని చెప్పారు. నిపా వ్యాధి కి టీకాలు లేవని నివారణ ఒక్కటే మార్గం అన్నారు. ఇప్పటికే పూణే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తో నిపా వ్యాధి నిర్ధారణ పరీక్షల కు …
Read More »రైతుబంధుపై బీజేపీ వింత ప్రచారం..!!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి, పకడ్బందీగా అమలు చేసిన రైతుబంధు పథకంపై బీజేపీ చిత్రమైన రాజకీయాలు చేస్తోంది. ఓ వైపు ఈ పథకంపై కామెంట్లు చేస్తూనే మరోవైపు ఈ పథకం విజయవంతం అయ్యేందుకు తామే కారణమని ప్రచారం చేసుకుంటుకున్న తీరుపై రైతన్నల్లో విస్మయం వ్యక్తం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద 44 లక్షల మంది రైతులు దాదాపుగా రూ.4700 కోట్ల విలువైన చెక్కులు పొంది …
Read More »ప్రజా రవాణా వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తాం..మంత్రి మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని రవాణాశాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసీ జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని శిల్పారామం వద్ద రూ. 30 లక్షల తో పీపీపీ మోడల్లో నిర్మించిన ఏసీ బస్ స్టాండ్ ను ఆయన మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఏ అరికేపుడి గాంధీ, జీహెచ్ఎంపీ …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ,టీడీపీ నేతలు ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పలు పథకాలకు ఇటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను ఆకర్షించడమే కాకుండా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రాష్ట్రంలోని భద్రాది-కొత్తగూడెం జిల్లాలోని పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న టీడీపీ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు దాట్ల శివాజీ రాజు …
Read More »తెలంగాణలో మమ్మల్ని కలపండి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతన్నల కోసం పదిహేడు వేల కోట్లకుపైగా రైతు రుణాలను మాఫీ చేశారు . అంతే కాకుండా రైతన్నకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ,నాణ్యమైన విత్తనాలు ,ఉచిత ఎరువులతో పాటుగా లేటెస్ట్ గా ఎకరాకు పెట్టుబడి సాయం …
Read More »ప్రతిఒక్క రైతుకి రైతు బంధు చెక్కులివ్వాలి..సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతీ ఒక్కరికీ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పాసుపుస్తకం, రైతు బంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్ది మందికి పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని, కొన్ని చోట్ల చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని ముఖ్యమంత్రి చెప్పారు. సమస్యలేమున్నా పరిష్కరించి, అందరికీ పాసుపుస్తకాలు, చెక్కులు ఇవ్వాలని, జూన్ 2న కొత్త …
Read More »