తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచేందుకు ముందు వరుసలో ఉండే మంత్రి కేటీఆర్ ఈసారి దయనీయ పరిస్థితుల్లో ఉన్న అభ్యుదయ కవి, కథారచయిత చైతన్య ప్రకాష్ కు అండగా నిలిచారు. ముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాష్ గత ఇరవై అయిదు సంవత్సరాలుగా అనేక కథలు, పుస్తకాలు వ్రాస్తున్నారు. సామాజిక చైతన్యం, వామపక్ష భావజాలంతో సాహిత్యాన్ని …
Read More »ఖమ్మంలో మంత్రి తుమ్మల సుడిగాలి పర్యటన..!
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, దానవాయిగూడెం, రామన్నపేట గ్రామాల్లో సిమెంట్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోలేపల్లి గ్రామంలో నిర్మించిన 18 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో …
Read More »సినీపరిశ్రమలో వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తాం..మంత్రి తలసాని
సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తదనిమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సినీ ప్రముఖులు, మా ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. అనంతరం ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని.. సినీరంగంలో నెలకొన్న పరిణామాలపై చర్చించామన్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. చిత్ర నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, …
Read More »పట్టాదారులందరికీ పాస్ బుక్స్, రైతుబంధు చెక్కులు..సీఎం కేసీఆర్
పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కలెక్టర్లతో సమావేశమై చర్చించారు.ఈ సమావేశంలో పాస్ బుక్స్ పంపిణీ, చెక్కుల పంపిణీ నిర్వహణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కొత్త పట్టాదారు పాస్ బుక్స్‌ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసైన్డ్ భూముల లబ్దిదారులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులు, ఏజెన్సీలో …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ వీకెండ్ ట్వీట్..!
తెలంగాణ రాష్ట్ర యువనేత, ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ట్విటర్‌లో ఎవరు ఏ అభ్యర్థన చేసినా, ఎవరూ ఏ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినా.. వెంటనే స్పందిస్తుంటారు. ఆపదలో ఉన్నవారికి అన్నా అంటే ఆదుకునే గొప్ప మనసు మంత్రి కేటీఆర్ ది. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ఎంతో మంది తమ కష్టాలు, సమస్యలపై కేటీఆర్ కు ట్విట్ చేస్తారు.కొన్ని సార్లు …
Read More »సీఎం కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్ విజేతలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ కామన్వెల్త్ గేమ్స్ 2018 విజేతలు కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని సీఎం కేసీఆర్ అభినందించారు. క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌ను కూడా కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్‌లో తెలంగాణకు చెందిన వారు మెడల్స్ సాధించడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారన్నారు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని …
Read More »నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..!
పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై చర్చించడానికి ఇవాళ ( శనివారం ఏప్రిల్-21) కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు . ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు. పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన సమయంలో రైతులందరికీ అందేలా సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని …
Read More »ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది. సుదీర్ఘంగా కొనసాగించిన తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల వల్ల తెలంగాణ ఎయిమ్స్‌కి మార్గం సుగమం అయింది. ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవైపు సీఎం కెసిఆర్, ఢిల్లీలో ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు చేసిన పలు ప్రయత్నాలు సఫలం అవడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »మానవత్వాన్ని నిలిపిన వ్యక్తికి.. మంత్రి కేటీఆర్ సహాయం
వృద్ధులైన తల్లిదండ్రుల విషయంలో కొందరు కుమారులు, కుమార్తెలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరు గురించి నిత్యం పత్రికల్లో ఎన్నో వార్తలు వస్తున్న తీరును మనమంతా చూస్తున్నాం. వయసు పైబడిన వారిని అనాథలుగా పట్టించుకోని సుపుత్రులు ఎందరో. అయితే ఓ యువకుడు తన తల్లికోసం తన చదువును పక్కనపెట్టాడు. తల్లిని సాకేందుకు అంకితమమయ్యాడు. నిలువ నీడ లేకున్నా…కంటికి రెప్పలాగా కన్న తల్లిని కాపాడుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి ఏదైనా సహాయం చేయాలన్న కథనం మంత్రి …
Read More »మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పారు.ఈ మేరకు ఇవాళ అయన ఓ ట్వీట్ చేశారు.శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చిందని…ఈ విషయాన్నిహైదరాబాద్ నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ …
Read More »