తనదైన అగ్రెసివ్ డైలాగులతో, పదునైన విమర్శలతో, పంచ్ డైలాగులతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకునే వైసీపీ నేతల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ముందు వరుసలో ఉంటారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దూకుడుగా వ్యవహరిస్తూ… సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్‌లపై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేది ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్. అయితే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయ విమర్శలు …
Read More »Blog Layout
తెలంగాణకు మరో పదేళ్లు నేనే సీఎం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దిగిపోతాడంట. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తాడంట. అని బయట ప్రచారం జరుగుతుంది. నేనేందుకు దిగిపోతాను. నాకేమి బాగానే ఉన్నాను కదా.. నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ఎందుకు చేస్తానని” ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …
Read More »తిరుమల మెట్ల మార్గంలో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ…!
టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల పలు విప్లవాత్మక మార్పులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు, వయోవృద్ధులకు 30 నిమిషాల్లోనే ఉచిత దర్శనం వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇవాళ తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో ఉన్నటువంటి షాపులను, మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో …
Read More »గోదావరి నదిలో బోటు మునక..!
నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాపికొండలు చూడటానికి వీళ్లు బయలు దేరినట్లు సమాచారం. అయితే ఈ పర్యాటకుల్లో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించారని అధికారులు చెబుతున్నారు. వీటిని ధరించిన వాళ్లు మాత్రమే ఒడ్డుకు చేరారు. మిగతా వారి అచూకీకోసం అధికారులు ప్రయత్నాలు …
Read More »కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా.. మీ వేల కోట్ల దోపిడీ అంతా బయటకు వస్తుంది..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ల విమర్శలకు తనదైన స్టైల్లో పదునైన పంచ్ డైలాగులతో, సెటైర్లతో కౌంటర్ ఇచ్చే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ విజయసాయిరెడ్డి… తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకుపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల ఆధ్యర్యంలో పోలవరం ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. …
Read More »మరో పదేళ్లు సీఎం ఎవరో తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో వివాదమైన నల్లమల అడవిలోని యూరేనియం తవ్వకాలపై అనుమతుల గురించి చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికి నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలపై అనుమతులివ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వం అని తేల్చి చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని …
Read More »చంద్రబాబుకు షాక్…వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలంతా బీజేపీలో చేరగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇవాళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »తిరుమలలో వయో వృద్ధులకు ఉచిత దర్శనం..సమయాలు ఇవే..!
టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల విఐపీలకు బ్రేక్ దర్శనాలు కల్పించే ఎల్1, ఎల్2, ఎల్3 లను రద్దు చేశారు. దేవుడి ముందు అందరూ సమానమే అని ప్రకటించారు. తాజాగా తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి …
Read More »ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం..హాజరైన సీఎం జగన్..!
ఏపీలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి నిరోధానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లోకాయుక్త పదవికి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇవాళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు …
Read More »పీవోకేలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం..!
కశ్మీర్‌లో వివాదాస్పద ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో పాకిస్తాన్ షాక్‌కు గురైంది. కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల్లో భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కుయుక్తులు ఫలించలేదు. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలన్నీ కశ్మీర్ భారత్ అంతర్భాగం అని..తేల్చి చెప్పాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత్‌పై యుద్ధం చేస్తామని, అణుబాంబులతో దాడులు చేస్తామని బీరాలు పలుకుతున్నాడు. కశ్మీర్ తర్వాత భారత్ తదుపరి లక్ష్యం పాక్ …
Read More »