తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ పూజలు నిర్వహించి స్విచ్ఛాన్ చేసి వెట్ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి …
Read More »Blog Layout
ఎన్డీ తివారీ కొడుకు మృతిలో సంచలనాత్మక ట్విస్ట్
ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి,అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మృతి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో శేఖర్ తివారీ సతీమణి అపూర్వ తివారీని దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు ఈ రోజు బుధవారం అరెస్టు చేశారు.రోహిత్ శేఖర్ తివారీది సహాజ …
Read More »తెలంగాణ”ఫీజు రీయింబర్స్ మెంట్” దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టి అమలుచేస్తోన్న పలు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అంతే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ దగ్గర అమలుచేస్తామని చెప్పి ఆ దిశగా అడుగులు కూడా వేస్తోన్నాయి. తాజాగా కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్త …
Read More »కచ్చితంగా ఎన్నికలు వస్తాయంటున్న వైసీపీ శ్రేణులు.. జగన్ కూడా సిద్ధమట.. లాజిక్ ఏంటో తెలుసా.?
2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నామంటూ సంకేతాలిస్తోంది. టీడీపీ మాత్రం ఈ ఎన్నికలు చెల్లవని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు సరిగా జరగలేదని, ఈవీఎంలలో తప్పులు జరిగాయని ఇలా రకరకాల కారణాలు చెప్తూ మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల గవర్నర్ ను కలిసిన అనంతరం వైసీపీ అధినేత మాట్లాడుతూ ఓటమి భయం, ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు అలా మాట్లాడుతున్నారన్నారు. …
Read More »పేరు లేకుండా ఓటేసిన హీరో..!
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో శివ కార్తికేయన్ ఈ నెల పద్దెనిమిది తారీఖున జరిగిన ఎన్నికల్లో వలసరవక్కం బూత్ లో ఓటేసేందుకు వెళ్లారు. అక్కడకి అతను ,తన భార్య ఆర్తి వెళ్ళారు. అయితే ఓటరు జాబితాలో ఆర్తి పేరు మాత్రమే ఉంది . హీరో శివ కార్తికేయన్ పేరు మాత్రం లేదు. అయినా సరే హీరో శివ కార్తికేయన్ ఓటేసి వచ్చి మరి ఇంకు పెట్టిన వ్రేలితో దిగిన …
Read More »లాభాల్లో మార్కెట్లు
ఈ రోజు బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం వంద పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమై సెన్సెక్స్ కొద్దిసేపటి క్రితం 109పాయింట్ల లాభంతో 38,674వద్ద ట్రేడవుతోంది. అటు నిఫ్టీ ముప్పై నాలుగు పాయింట్ల లాభంతో 11,610 వద్ద ఉంది. అమెరికా స్టాక్స్ నిన్న భారీ లాభాలు ఆర్జించడంతో పాటు ఈ రోజు ఆస్ట్రేలియా సహా ఆసియా మార్కెట్లూ సానుకూలంగా ట్రేడవడం దీనికి ప్రధాన కారణం అని విశ్లేషకులు …
Read More »సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన‘లిటిల్ మాస్టర్’ఎలా అయ్యారో మీకోసం..?
క్రికెట్ దేవుడు భారత రత్న సచిన్ టెండూల్కర్ ఈరోజున 46వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయన క్రీడా ప్రస్థానం మీకోసం..! * సచిన్ టెండూల్కర్ 1973 ఏప్రిల్ 24న ముంబయిలో జన్మించారు. *పదహారేళ్ల వయసులో అంటే 1989 భారత్- పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన అడుగుపెట్టారు. *ఆ తరువాత 1990లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాగా ఆయనకు ఇదే తొలి శతకం.ఆ …
Read More »కాంగ్రెస్ ముందు కొత్త టెన్షన్…అందుకే ఇలా
వరుస ఓటముల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలంటేనే…ఒకింత కలవరం మొదలవుతోందనే చర్చ జరుగుతోంది. ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా ఎదురవుతున్న ఓటముల నేపథ్యంలో….రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడంపై ఆ పార్టీ నేతల్లో మథనం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, స్థానిక సంస్థల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లోనూ నిరాశకరమైన మద్దతు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో రాబోయే ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది. అందుకే పెద్ద …
Read More »క్యాడర్, లీడర్ లేకపోవడంతో కామెడీ నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, పంచాయతీ ఎన్నికల్లో పత్తా లేకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితి…ఇలాంటి పరిచయ వాక్యాలకు పరిమితం అయిపోయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జరుగుతనున్న పరిషత్ ఎన్నికలపై ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుంది. పోటీ చేయకపోవడమే సరైనదని ముందుగా భావించినప్పటికీ… కనీసం ఉన్న పదిమంది నాయకుల కోసమైనా… బరిలో నిలవాలని భావిస్తోంది. స్థూలంగా వీలైతే పోటీ చేద్దాం..లేదంటే మద్దతిద్దాం అనే నిర్ణయానికి వచ్చింది. ఆ మద్దతు …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. ఇప్పటికే పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి అని బాధపడుతున్నవారికి ఊరట ఇది. వీరందరికీ శుభవార్తను అందిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు మరో రెండు రోజులు గడవు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది.అంతే కాకుండా సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా రెండ్రోజుల పాటు గడవును పెంచింది. దీంతో ఈ నెల 27వరకూ రీవెరిఫికేషన్ /రీకౌంటింగ్ లతో పాటు సప్లిమెంటరీ ఫీజులను చెల్లించుకోవచ్చు.
Read More »