భారీ వర్షాలు కురుస్తున్నందున మహారాష్ట్రతో పాటు తెలంగాణకు రెడ్‌అలర్ట్ ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్‌ను అలర్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, వరదల …
Read More »Blog Layout
వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్..
వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికయ్యారు. వైసీపీ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు తనపై కార్యకర్తలు, అభిమానులు ఆప్యాయత చూపించి అనురాగం పంచుతున్నారని చెప్పారు. ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోందన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విధానాలు, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు నిండు మను సెల్యూట్ చేస్తున్నట్లు …
Read More »అదానీ సంచలన నిర్ణయం
టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read More »చంద్రముఖి-2 లో ఆ హీరోయిన్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించి విడుదలై బంపర్ హిట్ సాధించిన మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా చంద్రముఖి-2 రూపొందుతోంది. దర్శకనిర్మాత డాన్స్ మాస్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ మూవీని తెరకెక్కించిన పి. వాసు ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కోసం హీరోయిన్ త్రిషను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడీ అవకాశం లక్ష్మీ మేనన్ దక్కించుకున్నట్లు తెలిసింది. స్క్రిప్ట్ నచ్చడంతో …
Read More »ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విటర్ ను కొనుగోలు చేస్తానన్న డీల్ ను మస్క్ రద్దు చేసుకున్నారు. ఫేక్ అకౌంట్లకు సంబంధించి వివరాలు సమర్పించడంలో ట్విటర్ విఫలమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ కు టెస్లా లేఖ రాసింది. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ఏఫ్రిల్ నెలలో ప్రకటించారు.
Read More »స్మిత్ సరికొత్త రికార్డు
టెస్ట్ మ్యాచ్ చరిత్రలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్ స్మిత్ రికార్డు ను సృష్టించాడు. స్టీవ్ స్మిత్ అరుదైన సరికొత్త రికార్డు దిశగా దూసుకుపోతున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 87 మ్యాచ్ లు ఆడి 28 సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో స్మిత్ సెంచరీ చేసి ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ మన్ 29 …
Read More »రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం
టీమిండియా ఆటగాడు.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ప్రస్తుతం ఐపీల్ లో తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేశాడు. దీంతో అతను వచ్చే ఐపీఎల్ లో ఆ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్లో కెప్టెన్ లో వ్యవహరించిన జడేజా విఫలమయ్యాడు. మధ్యలోనే కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు. తర్వాత …
Read More »టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడంపై దాదా సంచలన వ్యాఖ్యలు
టీమిండియా జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించడం అంత మంచిదేమీ కాదని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో అంత మంది ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని దాదా చెప్పాడు. ఈ పరిస్థితులకు ఎవరినీ తప్పుపట్టలేమన్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విరామమివ్వక తప్పదన్నాడు. ప్రతి సిరీస్ కు కోచ్ ద్రవిడ్ పరిస్థితి చూస్తే బాధనిపిస్తుందన్నాడు.
Read More »తెలంగాణలో కొత్తగా 608 కరోనా కేసులు
తెలంగాణరాష్ట్రంలో గత ఇరవై నాలుగంటల్లో కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 608 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5,146కు చేరింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 459 మంది బాధితులు కోలుకున్నారు.
Read More »ఒకే పాఠశాలలో 31మందికి కరోనా పాజిటీవ్
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని అండిపట్టి పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కోవిడ్ సోకింది. అంతేకాకుండా 10 విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ పాఠశాలను మూసివేశారు. దీంతో పాఠశాలలో ఉన్న మిగతా విద్యార్థులకు పరీక్షలు చేయిస్తోంది. కాగా నిన్న దేశవ్యాప్తంగా 18,815 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More »