Classic Layout

మరోసారి పవన్ కల్యాణ్ ఇజ్జత్ తీసేసిన రాపాక..!

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు వ్యవహారశైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా పదే పదే విమర్శలు చేస్తుంటే..అదే స్థాయిలో రాపాక జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ పవన్ గాలి తీసేస్తున్నాడు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ను దేవుడిలా కొలిచి, ఆ పై రెండుసార్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరీ పవన్‌కు షాక్ ఇచ్చాడు తాజాగా రాపాక మరోసారి పవన్ …

Read More »

తల్లి మాకు జన్మనిస్తే.. వైఎస్‌ జగన్‌ పునర్జన్మ

14 నెలలు పాకిస్తాన్‌ చెరలో గడిపిన ఆంధ్రా జాలర్లు ఎట్టకేలకు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పునర్జన్మ ప్రసాదించారని పాక్‌ జైలు నుంచి విడుదలై ఢిల్లీ చేరుకున్న 20 మంది మత్స్యకారులు  ఆనందం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘మాకు పునర్జన్మ లభించింది. పాకిస్తాన్ నుంచి బయటకు వస్తామో లేదోనని భయపడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో మేమంతా బయటికి రాగలిగాం. గుజరాత్‌ తీర ప్రాంతంలో …

Read More »

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు..టీటీడీ సేవలు భేష్..!

ముక్కోటి ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠవాసుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. దాదాపు 20 గంటల పాటు వేచి ఉన్న భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుని పులకించిపోయారు.దాదాపు 4 లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ షెడ్లు ఏర్పాటు చేసింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగాభక్తులు సంతోషంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ …

Read More »

జగన్‌ ప్రజల కష్టాలు తెలిసిన మనిషి.. ప్రధాని సోదరుడు ప్రసంశలు !

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన మనిషని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజికవేత్త ప్రహ్లాద్‌ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన అతిధిగా పాల్గొన్నారు. స్థానిక దేవతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని, విశేష పూజలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14లక్షలకు పైగా ఉన్నారన్నారు. బడుగు, …

Read More »

చంద్రబాబు ఓ పనికిమాలినవాడు..టీడీపీ పీడ పోవాలి… జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

మీరు విన్నది నిజమే..టీడీపీ పీడ పోవాలి అన్నది..సాక్షాత్తు అనంతపురం మాజీ ఎంపీ, వివాదాస్సద టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి గారే ఈ మాటలు అన్నారు..ఏంటీ నమ్మలేకపోతున్నారా..నిజం..పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మోడీ సర్కార్ కనుక భారత్‌లో కలిపితే..వెంటనే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని…దేశంలో మా తెలుగుదేశంతో సహా ప్రాంతీయపార్టీల పీడ పోవాల్సిందే..అని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో స్థానిక నాయకులతో జేసీ పిచ్చాపాటి మాట్లాడుతూ పలు …

Read More »

ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన సినీ, రాజకీయ ప్రముఖులు..!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్‌ మహేశ్వరితో పాటు పలువురు రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు దర్శించుకున్నారు. రాత్రి రెండు గంటలకు విరామ సమయం దర్శనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సినీ ప్రముఖులు శ్రీ వారిని దర్శించుకొన్నారు.       కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పాముల …

Read More »

అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులతో సీఎం జగన్‌ సమావేశం..!

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నేడు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది.  అలాగే మూడు రాజధానుల ప్రకటనపై ఆయా జిల్లాలోని పరిస్థితులను సీఎం జగన్‌కు మంత్రులు వివరించనున్నట్లు సమాచారం. …

Read More »

మొన్న బోడె..నేడు గద్దె..ఈ ఒక్క రోజు నిరాహార దీక్షలేంటీ బాబు…జనాలు నవ్వుతున్నారు..!

ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్  ప్రకటన, జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలకు వ్యతిరేకంగా రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు 18 రోజులుగా ధర్నాలు, ర్యాలీలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలను టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, రాజధాని ప్రాంతంలోని టీడీపీ నేతలు  పథకం ప్రకారం నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక రాజధానిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబుతోసహా, …

Read More »

అమరావతిలో టీడీపీ రాజకీయంపై ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు…!

ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, సీమ నేతలు విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేత, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. అదే సమయంలో అమరావతిలో చంద్రబాబు చేయిస్తున్న ఆందోళనలపై తమ్మినేని మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు జగన్మోహన్‌రెడ్డి కారణంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat