rameshbabu
January 22, 2022 MOVIES, SLIDER
514
జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ మూవీ విడుదల తేదీని ఆ చిత్ర బృందం ఖరారు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గి.. అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతిస్తే మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం …
Read More »
rameshbabu
January 22, 2022 SLIDER, TELANGANA
424
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుముల లేఖ రాశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలన్నారు.
Read More »
rameshbabu
January 22, 2022 HYDERBAAD, SLIDER
682
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా నేడు, రేపు కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి, లింగంపల్లి- ఫలక్ నుమా, సికింద్రాబాద్- లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Read More »
rameshbabu
January 22, 2022 NATIONAL, SLIDER
814
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Read More »
rameshbabu
January 22, 2022 SLIDER, TELANGANA
566
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గత 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించారు.ఇందులో కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,920 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »
rameshbabu
January 22, 2022 HYDERBAAD, SLIDER
691
గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,670 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,69,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »
rameshbabu
January 22, 2022 SLIDER, SPORTS
603
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో డకౌట్ అయిన విరాట్ కోహ్లి ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున వన్డే క్రికెట్లో రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్ు 13 సార్లు డకౌట్ కాగా, కోహ్లి వారిని దాటేసి 14 డకౌట్లతో రైనా, సెహ్వాగ్, జహీర్ తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరికంటే ముందు సచిన్ (20 డకౌట్లు), జగవల్ శ్రీనాథ్ (19 డకౌట్లు), అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ …
Read More »
rameshbabu
January 22, 2022 SLIDER, SPORTS
688
సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఓడిన భారత్.. తాజాగా వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. ఈ రోజు జరిగిన 2వ కీలక వన్డేలో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 287/6 స్కోర్ చేసింది. ఛేజింగ్కి దిగిన సౌతాఫ్రికా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.1 ఓవర్లలో రన్స్ చేధించింది. దీంతో మరో వన్డే మ్యాచ్ ఉండగానే …
Read More »
rameshbabu
January 22, 2022 NATIONAL, SLIDER
747
గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. తాను ఆశించిన నియోజకవర్గం టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనారు. పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడనున్నట్లు వెల్లడించారు. తన తండ్రి పోటీ చేసిన పనాజీ నియోజకవర్గాన్ని సెంటిమెంట్గా భావించి.. అక్కడ నుంచే పోటీ చేస్తున్నట్లు ఉత్పల్ పారికర్ తెలిపారు.
Read More »
rameshbabu
January 22, 2022 ANDHRAPRADESH, SLIDER
907
ఈ సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 7 నుంచి 18 వరకు రూ. 144 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 5,422 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా ఈ నెల 17వ తేదీన ఒక్కరోజే రూ.15.40 కోట్లు వచ్చిందన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.
Read More »