Classic Layout

‘పుష్ప’ టీమ్ కు సుకుమార్ బంపర్ ఆఫర్

ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘పుష్ప’ సినిమా కోసం పని చేసిన కిందిస్థాయి సిబ్బందికి డైరెక్టర్ సుకుమార్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టెక్నీషియన్స్, సెట్ బాయ్స్ పాటు సినిమా కోసం పనిచేసిన సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాడు. మూవీ షూటింగ్ సమయంలో వారందరూ అడవుల్లో ఎంతో కష్టపడ్డారని సుకుమార్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది.

Read More »

కీర్తి సురేష్ భర్తగా నాగ శౌర్య

అన్నాత్తే మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ చెల్లెలిగా నటించి ప్రశంసలందుకున్న క్యూట్ హీరోయిన్ కీర్తి సురేశ్.. భోళాశంకర్లోనూ మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్గా చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీర్తికి భర్తగా యంగ్ హీరో నాగశౌర్య నటించనున్నాడని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. మూవీకి మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తుండగా.. తమిళంలో వచ్చిన వేదాళం సినిమాను తెలుగులో భోళాశంకర్గా రీమేక్ చేస్తున్నారు.

Read More »

టికెట్ ధరల వ్యవహారంపై మంచు విష్ణు మౌనం ఎందుకు..?

ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రచ్చ లేపుతున్నా.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు హీరోలు, డైరెక్టర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. అయితే విష్ణు ఇంతవరకు నోరు విప్పలేదు. కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. సీఎం జగన్ బంధుత్వం వల్లే విష్ణు సైలెంట్ గా ఉంటున్నారని కొందరు వాదిస్తున్నారు.

Read More »

సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి KTR సెటైర్స్

ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 75కే చీప్ లిక్కర్, ఇంకా కుదిరితే రూ.50కే ఇస్తామంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘వావ్… ఏమి పథకం! ఎంత అవమానకరం. ఏపీలో బీజేపీ మరింత దిగజారింది’ అంటూ ఎద్దేవా చేశారు. చీప్ లిక్కర్ను రూ.50కే సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానమా? లేక నిరాశ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనా ఈ బంపర్ …

Read More »

UKలో కరోనా కలవరం

UKలో గత 24 గంటల్లో 1,29,471 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. తాజా కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,38,676కి చేరుకుంది. ఒక్కరోజే 18 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 1,48,021కి చేరుకుంది. కరోనా వ్యాప్తికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణమని తెలుస్తోంది.

Read More »

TRS Mp కె. కేశవరావు కి కరోనా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కరోనా బారినపడ్డారు. RTPCR పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే ఆయన నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారి సలహా మేరకు ఇంటికి వెళ్లి క్వారంటైన్లో ఉన్నారు.

Read More »

దేశంలో 781 ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 781 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అత్యధికంగా ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇక తెలంగాణలో 62 కేసులు రాగా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు.

Read More »

ఒమిక్రాన్ వేరియంట్ పై WHO హెచ్చరిక

ఒమిక్రాన్ వేరియంట్ రిస్క్ ఇంకా తీవ్రంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే డిసెంబర్ 20 నుంచి 26 వరకు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 11% పెరిగాయని పేర్కొంది. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్లు నిరూపితమైందని చెప్పింది. వివిధ దేశాల రిపోర్టులను బట్టి చూస్తే 2-3 రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నాయని వివరించింది.

Read More »

Tollywood హీరో మంచు మనోజ్ కు కరోనా

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపాడు. “నాకు కరోనా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం నుంచి కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి” అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.

Read More »

మిథాని- ఓవైసీ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి KTR..

హైదరాబాద్ నగరంలోని ఓవైసీ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లై ఓవర్‌ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్‌వే మార్గంగా మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 1.36 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat